/rtv/media/media_files/2025/03/19/o6X55N2XqSG0XMC7IeAR.jpg)
Telugu Horror Movies
Telugu Horror Movies: మన తెలుగు హీరోలు(Telugu Heros) ఈ మధ్య వరుసగా దెయ్యాల సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. అల్లరి నరేష్(Allari Naresh) నుండి రాజాసాబ్ ప్రభాస్(Raja Saab Prabhas) వరకు ఎక్కువ మంది యంగ్ హీరోస్ ఇంకా సీనియర్ హీరోస్ కూడా హారర్ మూవీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ లో హారర్ మూవీస్ కి మంచి క్రేజ్ ఉంది అక్కడ రిలీజ్ అవుతున్న హారర్ సినిమాలన్నీ దాదాపుగా హిట్ అవుతున్నాయి. కమెర్షియల్ గా మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయి. అందుకోసమే మన తెలుగు హీరోలు కూడా హారర్ కథలకు ఓటేస్తున్నారు.
హారర్ బాట పట్టిన అల్లరోడు..
తాజాగా అల్లరి నరేష్(Allari Naresh) నటించిన ‘12A రైల్వే కాలనీ’ అనే మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. గతంలో అన్ని కామెడీ సినిమాలు చేసే నరేష్ ఇప్పుడు రూట్ మర్చి సీరియస్ ఫిలిమ్స్ తీస్తున్నాడు అయితే, తాజాగా అల్లరి నరేష్ తీసిన 'బచ్చలమల్లి' అంతగా ఆడలేదు అయితే ఈ సారి ‘12A రైల్వే కాలనీ’ అంటూ సరికొత్తగా హారర్ బాట పట్టాడు ఈ అల్లరోడు. ఈ మూవీలో నరేష్ ఏకంగా ఆత్మలతో మాట్లాడగలిగే ఒక భయంకరమైన పాత్రను పోషిస్తున్నారట. ‘పొలిమేర’ డైరెక్టర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
రూటు మార్చిన అక్కినేని హీరో..
సుశాంత్(Sushanth) హీరోగా, డైరెక్టర్ పృథ్వీరాజ్ ఓ సూపర్ నేచురల్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవలే విడుదలైంది. ఇందులో కూడా సుశాంత్ పాత్ర భూత వైద్యుడుగా ఉండబోతోందట, అలాగే ఆ పాత్రకు మరో కోణం కూడా ఉంది. దయ్యాలు, ఆత్మలు కాన్సెప్ట్ లో మూవీ చేయడం సుశాంత్ కి ఇదే మొదటి సారి.
The Darkness is coming... 🌑
— Sushanth A (@iamSushanthA) March 18, 2025
Get ready for a spine-chilling battle⚔️🩸#SA10 On The Way 💥@sanjeevanioffl @chprithvich @varunjerry05 @rajkumarj96 #AnirudhKrishnamurthy #YVBShivaSagar #AshishTeja #BabuReddy @UrsVamsiShekar @HaashtagMedia pic.twitter.com/KEHgUW9POq
మట్కా తో ప్లాప్ ఇచ్చిన తర్వాత వరుణ్ తేజ్(Varun Tej) మేర్లపాక గాంధీతో కలిసి హారర్ కామెడీ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో కూడా ఆత్మలు, భూత వైద్యం వంటి అంశాలు ఉండబోతున్నాయట. ఈ కథ రాయలసీయ, కొరియన్ ఆత్మల నేపథ్యంలో సాగుతుంది అని సమాచారం.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
ఇక లారెన్స్(Raghava Lawrence) కాంచన సిరీస్ గురించి చెప్పనవసరం లేదు, తాజాగా కాంచన 4 తెరకెక్కిస్తున్నారు లారెన్స్ అందులో హీరోయిన్స్ గా నోరా ఫతేహి, పూజా హెగ్డే మెరవనున్నారు.
మూడు తరాల ఆత్మలతో "రాజాసాబ్"
ఇంకా, ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న "రాజాసాబ్" చిత్రం కూడా హారర్ కామెడీ కావడం, అందులోనూ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ఏకంగా మూడు తరాల ఆత్మలు, వాటి భావోద్వేగాలు, దుష్ట శక్తుల గురించి చాలా ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు మారుతి. ఈ కథలో కామెడీ, హారర్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సిద్ధం చేస్తున్నారు.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
తెలుగు ఆడియన్స్ కూడా హారర్ మూవీస్ అంటే మంచి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దెయ్యాల సినిమాలకి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. మరి, ఈ మూవీస్ అన్నింటిలో ఏది ఎక్కువ బయపెడుతుందో చూడాలి.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..