CINEMA: సినీ ఇండస్ట్రీకి సీఎం బంపరాఫర్.. ఇకపై రోజుకు 5 షోలు ఫిక్స్!

తమిళనాడులో ప్రతి కొత్త తమిళ సినిమాకు మొదటి వారం వరకు రోజుకు 5 షోలు వేసుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకపై ప్రత్యేక పర్మిషన్ అవసరం లేదు. నిర్మాతలు, థియేటర్లు కలిసి షోలు ప్లాన్ చేసుకోవచ్చు.

New Update
CINEMA

CINEMA

CINEMA: సినిమా విడుదలైనప్పుడు మొదటి వారం రోజుల్లో అదనపు షోలు కోసం నిర్మాతలు ప్రభుత్వ అనుమతి కోసం వెళ్లడం సాధారణంగా జరుగుతుంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మల్టీప్లెక్స్‌ల్లో అయితే షోలకు పెద్దగా ఇబ్బంది ఉండదు.

ఇలాంటి పరిస్థితి కేవలం టాలీవుడ్‌కే కాదు, కోలీవుడ్‌లో కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సినీ పరిశ్రమకు సంబంధించి అక్కడి ప్రముఖ నటుడు విజయ్ జోసెఫ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సినిమా పరిశ్రమ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. సినీ రంగ అభివృద్ధి కోసం వచ్చిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని, కొత్త విధానాన్ని అమలు చేశారని సమాచారం.

ఈ నిర్ణయం ప్రకారం, తమిళనాడులో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమాకు మొదటి వారం వరకు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే అవకాశం కల్పించారు. దీని కోసం ఇకపై ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

ఇకపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు కలిసి నిర్ణయం తీసుకుని అదనపు షోలు వేసుకోవచ్చు. ఈ విధానం వల్ల అనుమతి ప్రక్రియలో ఉండే ఆలస్యం తగ్గి, సినిమాల విడుదల మరింత సులభంగా మారుతుందని భావిస్తున్నారు.

తమిళ సినీ వర్గాలు ఈ నిర్ణయాన్ని పరిశ్రమకు ఉపయోగకరమైన అడుగని చెబుతున్నాయి. ఇదే విధమైన మార్పులు టాలీవుడ్‌లో కూడా వస్తాయా అనే చర్చ ఇప్పుడు మొదలైంది.

Advertisment
తాజా కథనాలు