/rtv/media/media_files/2024/11/01/pnlYT7T8yfPBXAToNool.jpg)
kamal hasan brother
Kamalhasan Brother Charuhasan: తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్‌కు అస్వస్థతకు గురయ్యారు. దీపావళికి ముందు తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని నటి సుహాసిని పోస్ట్ పెట్టారు. సీనియర్ నటుడు, దర్శకుడు చారుహాసన్ (93) అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి, అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె సుహాసిని మణిరత్నం సోషల్‌మీడియాలో వెల్లడించారు. "దీపావళికి ముందు మా తండ్రి అస్వస్థతకు గురయ్యారు. మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు" అని ఆమె చెప్పింది. శుక్రవారం ఆయనకు శస్త్రచికిత్స చేయనున్నట్లు సమాచారం.
Also Read: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!
Also Read: ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు
చారుహాసన్ అనేక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించారు. కన్నడ సినిమా "తబరన కథ"కి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును పొందారు. ఈ ఏడాది విడుదలైన 'హర' అనే తమిళ చిత్రంలో ఆయన కనిపించారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు సుహాసిని, సుభాషిని, నందిని.
Also Read: నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు!
చారుహాసన్, నటుడిగా మాత్రమే కాకుండా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించారు. ఆయన కొన్ని చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. 1979లో మహేంద్రన్ దర్శకత్వంలో విడుదలైన "ఉతిరిప్ పూకేమ్" సినిమాతో నటనలోకి అడుగు పెట్టారు. 93 సంవత్సరాల వయస్సులో కూడా యాక్టివ్‌గా ఉండి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన సుహాసిని, "మా నాన్న ప్రస్తుతం మెడికల్ వెకేషన్లో ఉన్నారు. డాక్టర్లు, నర్సులు మమ్మల్ని చూసుకుంటున్నారు" అని పేర్కొన్నారు.
Also Read: బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ నంబియార్ కన్నుమూత...చంద్రబాబు సంతాపం!