నేనలా అనలేదు..తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఛావాపై వివరణ ఇచ్చిన స్వర భాస్కర్!

ఛావా మూవీలో ఔరంగజేబు చేతిలో శంభాజీ అనుభవించిన హింస అంతా కల్పితమని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా  వివరణ ఇచ్చారు

New Update
Swara Bhasker

ఛావా మూవీలో ఔరంగజేబు చేతిలో శంభాజీ అనుభవించిన హింస అంతా కల్పితమని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.  దీంతో ఆమె తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా  వివరణ ఇచ్చారు. ‘నా ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఛత్రపతి శివాజీ ఘనతల్ని గౌరవిస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలా అని  గత వైభవం పేరు చెప్పి నేడు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చకండి అని చెప్పడమే నా ఉద్దేశం. చరిత్ర అందర్నీ కలిపేదిగా ఉండాలని కానీ విడదీసేలా కాదు.  నా వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతిస్తే.. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నా ’ అని అమె తన ట్వీట్ లో వెల్లడించారు.  

ఛత్రపతి శివాజీ కుమారుడైన శంభాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఛావా సినిమా తెరకెక్కింది.  ఇందులో విక్కీ కౌశల్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌ను తీవ్రంగా గాయపరిచి, గోళ్లు కత్తిరించి, కళ్లలో ఇనుప చువ్వలు దించి చిత్రహింసలకు గురిచేసి చంపారనే విషయాన్ని ఆమె తప్పుబట్టారు.  ఇది కేవలం కల్పితం అన్నట్లుగా ఆమె కామెంట్ చేశారు.  దీంతో నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.   చరిత్రను మార్చే హక్కు లేదని ఆమెకు తెలియజేస్తున్నారు. దీంతో ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 

 వికిపీడియా ఎడిటర్లపై  కేసు నమోదు 

మరోవైపు వికీపీడియాలో శంభాజీ మహారాజ్‌పై ఉన్న అభ్యంతరకర కంటెంట్‌ను తొలిగించినందుకు నలుగురు వికిపీడియా ఎడిటర్లపై మహారాష్ట్ర సైబర్ సెల్ కేసు నమోదు చేసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్‌పై అభ్యంతరకర కంటెంటును తొలగించాలని కోరినా చర్యలు తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 10+ ఈ మెయిల్స్ పంపితే ఆటోమేటిక్ రిప్లై వచ్చింది గానీ కంటెంట్ డిలీట్ చేయలేదు. దీంతో సీఎం దేవేంద్ర ఫడణవీస్ యాక్షన్ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఛావా సినిమా తరువాత తర్వాత వికీపీడియా కంటెంటుపై పలు అభ్యంతరాలు వచ్చాయి.

Also Read :   ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు