/rtv/media/media_files/2025/03/19/Pj7Bj7MmXyTMQ8fXbtRZ.jpg)
Hero Sushanth SA10
Hero Sushanth SA10: సుశాంత్ అనుమోలు హీరోగా చాలా రోజులకి ఒక మూవీ రాబోతోంది. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో ఓ సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చేస్తున్నాడు సుశాంత్. ఈ మూవీని వరుణ్ కుమార్, రాజ్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే మార్చి 18 మంగళవారం హీరో సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు సంబంధించి సుశాంత్ లుక్స్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆఫీషియల్ గా రిలీజ్ చేసారు. పోస్టర్‌లో, సుశాంత్ రెండు విభిన్న గెటప్స్ లో కనిపించి సర్‌ప్రైజ్ చేసారు.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
The Darkness is coming... 🌑
— Sushanth A (@iamSushanthA) March 18, 2025
Get ready for a spine-chilling battle⚔️🩸#SA10 On The Way 💥@sanjeevanioffl @chprithvich @varunjerry05 @rajkumarj96 #AnirudhKrishnamurthy #YVBShivaSagar #AshishTeja #BabuReddy @UrsVamsiShekar @HaashtagMedia pic.twitter.com/KEHgUW9POq
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
బూత వైద్యుడిగా సుశాంత్..
సుశాంత్ ఈ మూవీలో బూత వైద్యుడిగా కనిపిస్తున్నాడు. తెలుగు సినిమాలలో మునుపెన్నడూ ఇలాంటి మూవీ రాలేదని, ఈ పాత్ర కోసం సుశాంత్ చాలా కష్టపడ్డారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అనిరుధ్ కృష్ణమూర్తి రాస్తుండగా, పృథ్వీరాజ్ చిట్టేటి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరామ్యాన్ గా వైవీబీ శివసాగర్ వ్యవహరిస్తున్నారు.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..