'కంగువ' ఆ హాలీవుడ్ సినిమాల తరహాలో ఉంటుంది.. అంచనాలు పెంచేసిన సూర్య 'కంగువ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సూర్య సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.' బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ సినిమాల తరహాలో 'కంగువ' మూవీ ఉంటుంది. థియేటర్‌లో చూశాక మీకే తెలుస్తుంది..' అని అన్నారు. By Anil Kumar 23 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కంగువా. తమిళ మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సూర్య లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 14 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే మూవీ టీమ్ తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించింది . ఇందులో సూర్య, హీరోయిన్ దిశాపటానీ, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంగువా గురించి సూర్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ కచ్చితంగా హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తుందని అన్నారు. Also Read : నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'వేట్టయన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే 100 సంవత్సరాలు వెనక్కి.. ప్రెస్ మీట్ లో సూర్య మాట్లాడుతూ.." మనం బ్రేవ్‌హార్ట్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, అపోకలిప్టో వంటి చిత్రాలను ఇష్టపడతాం. వాటిని చూసి ఆశ్చర్యానికి గురవుతాం కూడా. ఆ సినిమాలు చాలాసార్లు చూశాం. మేము కూడా ఇప్పుడు అలాంటి సినిమాలే చేయబోతున్నాం. ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన శివకు వచ్చింది. అప్పటి ప్రజలు ఎలాంటి జీవితాన్ని గడిపారు? వారికి ఎదురైన కష్టాలేంటి? అనే విషయాలను తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని చెప్పాడు. ఆ విధంగానే కంగువాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. విజువల్ ఎఫెక్ట్స్, కథ విషయంలో శివ చాలా ప్రతిభావంతుడు. అతను థియేటర్‌లో కంగువా చూశాక మీకే తెలుస్తుంది.." అంటూ చెప్పుకొచ్చారు. దీంతో సూర్య కామెంట్స్ సినిమాపై మరింత హైప్ పెంచింది. Also Read : 'KGF' ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పార్ట్-3 పై అప్డేట్ ఇచ్చిన యశ్ #suriya #kanguva మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి