జమ్మూకశ్మీర్ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈదాడి నుంచి మరికొందరు వారి ప్రాణాలను అరచేతపట్టుకొని బయటపడ్డారు.నటి దీపికాకాకర్ తన భర్త షోయబ్ ఇటీవల కశ్మీర్ వెళల్లారు. విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ఇన్ స్టాలో పంచుకున్నారు.
కశ్మీర్ లోని అందమైన ప్రదేశాలను వీడియోలు తీసి షేర్ చేశారు. దాడి జరిగిన తరువాత వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారు చిక్కుకుపోయారేమో అని మెసేజ్ లు పెట్టారు.తాజాగా దీపికా, ఆమె భర్త షోయబ్ ఢిల్లీ కి వచ్చేసినట్లు చెబుతూ ఓ పోస్టు పంచుకున్నారు.
మేం క్షేమంగా ఉన్నాం.మంగళవారం ఉదయమే కశ్మీర్ నుంచి బయల్దేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం.ఎవరూ ఆందోళన పడకండి అని ఇన్ స్టాలో తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని తెలుపుతూ దీపికా భర్త నటుడు షోయబ్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. వారు ఢిల్లీ చేరుకున్నట్లు నటుడు తెలిపాడు.
ఈ పర్యటన పై వ్లాగ్ చేసినట్లు ప్రకటించారు.అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.ఒక వైపు పెనువిషాదం పై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్ ప్రచారం చేసుకుంటున్నారా..? అంటూ కొందరు నెటిజన్ లు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్ లో 27మంది మృతి చెందారు. మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం. చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా. పర్యాటకులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
Also Read:BIG BREAKING : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 27మంది మృతి!
Also Read: J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!
pahalgam army operation | Pahalgam attack | pahalgam breaking news | pahalgam latest news | bollywood | latest-news