Sreeleela: అసలు అక్కడ ఏం జరిగిందంటే..? మహేష్ క్లారిటీ!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల, మహేష్ మధ్య జరిగిన చిన్న ఇన్సిడెంట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. దీనిపై మహేష్ స్పష్టత ఇచ్చాడు అది కేవలం ఫోన్ కోసం చూసిన చిన్న సంఘటన మాత్రమే అని చెప్పారు.

New Update
Sreeleela

Sreeleela

Sreeleela: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ శ్రీలీల, నటుడు మహేష్(Mahesh Achanta) మధ్య ఏదో జరిగినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు చర్చకు వచ్చాయి. దీనిపై మహేష్ సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు.

శ్రీలీల ముందే తన ఫోన్ మహేష్ కి ఇచ్చిందని తాను ఒక్కసారిగా వెనక్కి తిరిగి మహేష్ వైపు చూస్తే ఫోన్ కోసం చూస్తున్నారని అనుకున్నానని. కానీ ఆమె స్క్రీన్ వైపుకు చూసి, వెంటనే ముందుకు తిరిగారని. మహేష్ అందులో ఎవరినీ అగౌరవించలేదని, కేవలం అక్కడ జరిగిన విషయం ఇదేనని చెప్పాడు.

అలాగే మహేష్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో నటించడం ఆనందంగా ఉందని, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పాడు. గతంలో చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’, రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ వంటి చిత్రాల్లో నటించి విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయడం ఉత్సాహంగా ఉందని వ్యక్తం చేశారు.

మహేష్ పోస్టు కింద అభిమానులు కూడా స్పందిస్తూ, సోషల్ మీడియాలో కొందరు అనవసరంగా వీడియోలు వైరల్ చేస్తూ కామెంట్స్ చేయడం అవసరం లేదని అంటున్నారు. వాస్తవానికి ఈవెంట్‌లో శ్రీలీల వెనుక స్క్రీన్ వైపుగా చూసి, వెంటనే ముందుకు తిరిగిన చిన్న సంఘటన మాత్రమే జరిగింది.

Advertisment
తాజా కథనాలు