/rtv/media/media_files/2026/06/01/prabhas-spirit-2026-06-01-08-10-59.jpg)
Prabhas Spirit
Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘Spirit’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది ఒక ఇంటెన్స్ పోలీస్ యాక్షన్ డ్రామా కాగా, ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్ షెడ్యూల్
‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని 45 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధ విమల్ థియేటర్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ థియేటర్ నగరంలో చాలా పేరున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒకటి.
UPDATE:#SPIRIT shoot will take place tomorrow at Vimal Theatre, Balanagar.#Prabhas is set to join the shoot tomorrow. This is a one day schedule.#TCExclusivepic.twitter.com/kFTZfx8nrV
— Telugu Chitraalu (@CineChitraalu) May 31, 2026
ఈ ప్రత్యేక షెడ్యూల్‌లో హీరో ప్రభాస్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఇది సుమారు రెండు రోజుల పాటు సాగనున్న షూట్‌గా తెలుస్తోంది.
షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అభిమానుల రద్దీని నియంత్రించేందుకు చిత్ర యూనిట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
భారీ తారాగణం
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి Triptii Dimri హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే విలన్ గా Vivek Oberoi నటిస్తున్నాడు. ఇది ఆయనకు టాలీవుడ్‌లో తొలి సినిమా కావడం విశేషం. ఇంకా ఈ సినిమాలో Kanchana, Aishwarya Desai వంటి పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను T-Series, Bhadrakali Pictures కలిసి నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని Harshavardhan Rameshwar అందిస్తున్నారు.
విడుదలపై భారీ అంచనాలు
‘స్పిరిట్’ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అలాగే చైనీస్, జపనీస్, కొరియన్ వంటి అంతర్జాతీయ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 మార్చి 5న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Follow Us