/rtv/media/media_files/2026/04/09/raaka-first-look-2026-04-09-11-45-22.jpg)
Raaka First Look
Raaka First Look: అల్లు అర్జున్(Allu Arjun) - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా “రాకా”కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేయగా, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఆయన చేయని విధంగా పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ గుండు లుక్‌లో, కళ్లకు కాజల్ వేసుకుని, ముఖం ఒక భాగాన్ని వూల్ఫ్ లాంటి గోరు కప్పినట్లు చూపించారు. ఈ లుక్ చూస్తే సినిమా కథ సై-ఫై బ్యాక్‌డ్రాప్‌లో ఉండొచ్చు అనిపిస్తుంది. డైరెక్టర్ అట్లీ కూడా ఈ సినిమాను “లిమిట్స్ దాటిన విజన్” అని చెప్పడంతో మరింత ఆసక్తి పెరిగింది.
Happy Birthday @alluarjun … the poster is intriguing and amazing just like you are. Can’t wait to see what you guys have put together. This experience will be… in Atlee’s words - Mass masss massss!! #Raaka looks so exciting, all the best!! @Atlee_dirpic.twitter.com/QHh3ZkpKQh
— Shah Rukh Khan (@iamsrk) April 8, 2026
ఈ పోస్టర్ చూసిన తర్వాత సినీ ప్రముఖులు, అభిమానులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా స్పందించారు. ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టర్‌ను షేర్ చేసి అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
షారుక్ ఖాన్ తన పోస్ట్‌లో మాట్లాడుతూ, ఈ పోస్టర్ చాలా ఆసక్తికరంగా, అద్భుతంగా ఉందని అన్నారు. అల్లు అర్జున్, అట్లీ కలిసి ఏ విధమైన సినిమా తీస్తున్నారో చూడాలని తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. అట్లీ స్టైల్‌లో చెప్పాలంటే ఈ సినిమా “మాస్… మాస్… మాస్…” అని కామెంట్ చేశారు. ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇందులో దీపికా పడుకోణె, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027లో ఏడు భారతీయ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమాకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు షారుక్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ కూడా స్పందించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఫస్ట్ లుక్‌తోనే ఇంత హైప్ వచ్చిందంటే, సినిమా విడుదలయ్యే సమయానికి మరింత భారీ స్పందన వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Follow Us