నిఘా పెట్టాల్సింది, తప్పు చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్ 'సిటాడెల్' సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో యాంకర్.. ఈ సిరీస్ లో మీరు స్పై ఏజంట్ కదా, రియల్ లైఫ్ లో స్పైగా నటించారా? అని అడగ్గా, దానికి సామ్.. నిజ జీవితంలో కూడా తాను అలాగే చేయాల్సిందని, అలా చేయకుండా చాలా తప్పు చేశానని బదులిచ్చారు. By Anil Kumar 22 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి అందాల ముద్దుగుమ్మ సమంత బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ప్రకటించిన సెప్టెంబరు నెల జాబితాలో దేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. సిటాడెల్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రీమేక్ హన్నీబన్నీకి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటూ వార్తల్లో నిలవడంతో దేశవ్యాప్తంగా ఆమె పేరు అందరి నోళ్లల్లో నానింది. దీంతో సహజంగానే అందరి హీరోయిన్లకన్నా టాప్ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో హన్నీబన్నీకి సంబంధించిన కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ అనేక విషయాలను విలేకరులతో పంచుకుంటోంది. రియల్ లైఫ్ లో అలా చేయాల్సింది.. ఈ సిరీస్ లో సమంత స్పై ఏజంట్ గా నటించింది. ఇందులో ఆమె చేసిన పోరాట దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సమంతను ఓ ప్రశ్న అడుగుతుంది. ఈ సిరీస్ లో మీరు స్పై ఏజంట్ గా నటించారుకదా.. నిజ జీవితంలో కూడా స్పైగా నటించారా? అని అడగ్గా దానికి సామ్ బదులిస్తూ నిజ జీవితంలో కూడా తాను అలాగే చేయాల్సిందని, అలా చేయకుండా చాలా తప్పు చేశానని, స్పైగా చేయకుండా ఉండటంవల్లే తన జీవితం ఇలా తయారైందని బదులిచ్చింది. Also Read : రికార్డు స్థాయిలో 'పుష్ప2' ప్రీ రిలీజ్ బిజినెస్.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకే సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సమంత-నాగచైతన్య వివాహ బంధం గురించే అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నాగ చైతన్య మీద నిఘా పెట్టాల్సిందని అలా చేయకపోవడం వల్లే తన జీవితం ఇలా అయిందని సామ్ పరోక్షంగా ప్రస్తావించినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే నాగచైతన్య-శోభిత చాలాసార్లు బయట కనపడ్డారు. వెకేషన్లకు వెళుతూ, విదేశాలకు వెళుతూ కనపడటంతో వీరిద్దరూ విడిపోవడానికి నాగచైతన్యే కారణమనే సందేహం అందరిలో నెలకొంది. నాగచైతన్య-శోభిత ప్రైవేటు పార్టీ ఫొటోలు కూడా ఆ సమయంలోనే బయటకు వచ్చాయి. Also Read : ఖైరతాబాద్ RTA ఆఫీస్ లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న న్యూలుక్, ఆ సినిమా కోసమేనా? సమంతతో విడిపోకముందే శోభితతో నాగచైతన్య రిలేషన్ నడపడం.. దాన్ని సమంత కనిపెట్టలేకపోవడం జరిగిందని, అలా జరిగివుంటే సమంత జాగ్రత్తపడేదని, తీరా అంతా జరిగిపోయిన తర్వాత బాధపడి ఉపయోగం లేదని సమంత అభిమానులు అంటున్నారు. నాగచైతన్య-శోభిత రిలేషన్ సమంతతో విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లిదాకా వెళతారని ఎవరూ ఊహించలేకపోయారు. #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి