Peddi Release: ‘పెద్ది’కి షాక్.. రిలీజ్‌కు ముందు బిగ్ ట్విస్ట్!

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా జపాన్ రిలీజ్ అనుకోని కారణాలతో రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. జూన్ 4 వరల్డ్ వైడ్ విడుదల మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

New Update
Peddi Release

Peddi Release

Peddi Release: రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే మరోసారి షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, జపాన్ రిలీజ్ రద్దు అయినట్లు అధికారికంగా ప్రకటించారు.

జపాన్‌లో సినిమాను విడుదల చేయాల్సిన ఇండో ఈగా సంస్థ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. “అనుకోని కారణాల వల్ల ‘పెద్ది’ ప్రదర్శనను తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ షో కోసం ఎదురుచూసిన అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాం” అని వారు ప్రకటించారు. అయితే ఈ రద్దుకు అసలు కారణం ఏమిటో మాత్రం వెల్లడించలేదు.

ఇప్పటివరకు కొత్త విడుదల తేదీ కూడా ప్రకటించలేదు. దీంతో జపాన్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.

‘పెద్ది’ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది. మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, తర్వాత ఏప్రిల్ 30కి, ఆపై జూన్ 4కి మారింది. ఇప్పుడు జపాన్ రిలీజ్ రద్దు కావడంతో సినిమాపై మరింత చర్చ జరుగుతోంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

గ్రామీణ నేపథ్యంతో 1980ల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. పాత్ర కోసం రామ్ చరణ్ రెజ్లర్‌గా ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అవుతున్న ‘పెద్ది’కు జపాన్ రిలీజ్ రద్దు ఒక పెద్ద సెట్ బ్యాక్ గా మారింది. అయితే జూన్ 4 విడుదల మాత్రం యథాతథంగా కొనసాగుతుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు