/rtv/media/media_files/2026/03/25/ram-charan-2026-03-25-11-18-24.jpg)
Ram Charan
Big Breaking: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన కంటి దగ్గర స్వల్ప గాయం అయింది. అయితే ఇది చిన్న గాయమేనని అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మూవీ టీమ్ తెలిపారు.
Ram Charan Injured in Peddi Shoot
మేకర్స్ ప్రకారం, రామ్ చరణ్ రెండు రోజుల విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత ఆయన తిరిగి సెట్స్‌లో చేరి షూటింగ్ కొనసాగిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఒక స్పెషల్ సాంగ్ కూడా షూట్ చేయనున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న వస్తుంది. ఆ రోజున సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశముంది.
సినిమా వివరాలు..
బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా గ్రామీణ నేపథ్యంలోని స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో ఉన్నారు. సంగీతం ఏ. ఆర్. రహ్మాన్ అందిస్తున్నారు. వెంకట సతీష్ కిలారు వ్రిధ్ధి సినిమా బ్యాక్ చేస్తోంది. ‘పెద్ది’ మూవీ మొదట మార్చి 27న రిలీజ్ ప్లాన్ చేశారు, కానీ మేకర్స్ కొత్తగా ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తునట్టు ప్రకటించారు.
Follow Us