/rtv/media/media_files/2026/04/28/ram-charan-2026-04-28-10-06-50.jpg)
Ram Charan
Ram Charan: ‘మగధీర’ తర్వాత రామ్ చరణ్ 2010లో ఓ భారీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అదే ‘మెరుపు’(Merupu) అనే టైటిల్‌తో రూపొందాల్సిన ప్రాజెక్ట్. ఈ సినిమాకు తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించాల్సి ఉండగా, 2010 ఏప్రిల్ 30న గ్రాండ్‌గా ఓపెనింగ్ కూడా జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.
ఈ సినిమా కథ స్పోర్ట్స్ నేపథ్యంతో ఉండేలా రూపొందించారు. రామ్ చరణ్ కూడా కథ నచ్చి చాలా ఉత్సాహంగా ఈ ప్రాజెక్ట్‌కి ఒప్పుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!
మొదట హీరోయిన్‌గా షాజాన్ పదమ్సీని తీసుకున్నారు. కానీ ఆమె నటనపై సంతృప్తి లేకపోవడంతో కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు. తర్వాత షూటింగ్ ఆలస్యం కావడంతో కాజల్ కూడా ఇతర ప్రాజెక్ట్‌లకు వెళ్లిపోయారు. ఆ తరువాత ఇలియానాను సంప్రదించారు.
సినిమా బడ్జెట్ మొదట 35 కోట్లుగా అనుకున్నప్పటికీ, అది పెరిగి మరింత ఎక్కువైంది. దీంతో నిర్మాత ఆర్బి చౌదరి అంత భారీ ఖర్చు భరించలేమని చెప్పారు. చిరంజీవి జోక్యం చేసుకొవడంతో కొంత షూటింగ్ కూడా జరిగింది. చెన్నైలో 15 రోజుల షెడ్యూల్ చేశారు, దానికి భారీగా ఖర్చు అయింది.
Also Read: ’కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
అయితే ఆ రష్ చూసిన చిరంజీవికి పూర్తి సంతృప్తి కలగలేదు. దాంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేయాలని సూచించారు. ఈలోగా అదే బ్యానర్‌లో మరో సినిమా ప్రారంభమైంది. చివరికి పెరుగుతున్న ఖర్చులు, కథలో మార్పులు కారణంగా ‘మెరుపు’ ప్రాజెక్ట్‌ను నిలిపివేశారు.
తరువాత ఈ సినిమాను మళ్లీ ప్రారంభించే ప్రయత్నాలు జరిగినా అవి ముందుకు వెళ్లలేదు. రామ్ చరణ్ కోచ్‌గా అర్జున్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావాల్సి ఉన్నప్పటికీ, సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.
Follow Us