/rtv/media/media_files/2026/05/11/peddi-trailer-2026-05-11-18-57-48.jpg)
Peddi Trailer
Peddi Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది Peddi పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. గ్రామీణ నేపథ్యంతో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి హైప్ తీసుకొచ్చాయి.
ఈ సినిమాకు దర్శకుడు బుచ్చిబాబు సన Buchi Babu Sana. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత AR రెహమాన్ AR Rahman అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’, ‘రై రై రారా’ పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
ఇప్పుడు అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. మే 18న ‘పెద్ది’ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో రామ్ చరణ్ పెద్ద ప్రయాణానికి బయలుదేరినట్టుగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ‘కాంచన 4’తో రాఘవ లారెన్స్ హిట్ ఫ్రాంచైజీకి ది ఎండ్.. ఎమోషన్ అవుతోన్న ఫ్యాన్స్!
#PEDDI will stay in your hearts❤️
— PEDDI (@PeddiMovieOffl) May 11, 2026
TRAILER From 18th May💥💥#PEDDI WORLDWIDE RELEASE IN CINEMAS ON JUNE 4th, with PREMIERES on JUNE 3rd pic.twitter.com/8wIgUTgGrz
సినిమాలో రామ్ చరణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ అంశాలను కలిపి దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. ఇండియన్ సినిమా గుర్తుంచుకునే పాత్రగా ‘పెద్ది’ నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Also Read: రిలీజ్‌కు సిద్ధమైన సీఎం విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’.. ఆ రోజే థియేటర్లలోకి!
ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ Janhvi Kapoor నటిస్తున్నారు. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ Shiva Rajkumar, జగపతి బాబు Jagapathi Babu, దివ్యేందు శర్మ Divyenndu Sharma, బొమన్ ఇరానీ Boman Irani కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు శ్రుతి హాసన్ Shruti Haasan ప్రత్యేక పాటలో మెరవనున్నట్లు సమాచారం.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు ట్రైలర్ ఫైనల్ కట్‌తో పాటు మూవీకి సంబంధించిన చివరి పనులను వేగంగా పూర్తి చేస్తున్నారట. సెన్సార్ సమస్యలు రాకుండా ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.
Also Read: నోరు జారిందా..? కావాలనే అన్నాడా? కమెడియన్ సప్తగిరిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!
దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా హైప్ మరింత పెరగడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Follow Us