Peddi: నా కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చా: రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న "పెద్ది" సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం పలు నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

New Update
Peddi

Peddi

Peddi: ఇటీవల రామ్ చరణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తన పాత్రను అర్థం చేసుకున్న విధానం, దానిని తెరపై చూపించిన తీరు గతంలో చేసిన ఏ పాత్రతోనూ పోల్చలేనిదని చెప్పారు. తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మంచి, చెడు ఫలితాలు వచ్చినా, నటన పరంగా మాత్రం "పెద్ది" తన బెస్ట్ వర్క్ అని ఆయన అన్నారు.

అంతేకాకుండా దర్శకుడు బుచ్చి బాబు సనా గురించి కూడా రామ్ చరణ్ ప్రశంసలు కురిపించారు. రాబోయే కొన్ని సంవత్సరాల్లో బుచ్చి బాబు దేశంలోని టాప్-4 దర్శకుల్లో ఒకరిగా నిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

"నా మాట గుర్తుంచుకోండి... బుచ్చి బాబు సనా వచ్చే కొన్నేళ్లలో అగ్ర దర్శకుల జాబితాలో ఉంటారు. ఆయన శరీరంగా సన్నగా కనిపించినా, ఆలోచనలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న అత్యంత ప్రతిభావంతులైన దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయనకు మరింత విజయాలు రావాలని కోరుకుంటున్నాను" అని రామ్ చరణ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. భారీ అంచనాల మధ్య "పెద్ది" సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
తాజా కథనాలు