Kanchana 4 Updates: 'కాంచన 4' అంత బడ్జెట్టా..! వర్కౌట్ అవుతుందా..?

రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వస్తోన్న'కాంచన 4' ఏకంగా 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని అని టాక్ వినిపిస్తుంది. ఈ సారి సరికొత్త కంటెంట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట చిత్ర యూనిట్.

New Update
Kanchana 4 Updates

Kanchana 4 Updates

Kanchana 4 Updates: హారర్ కామెడీ మూవీస్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాఘవ లారెన్స్. నవ్విస్తూ బయపెట్టడంలో లారెన్స్ కి మించినోళ్లు లేరు. 'ముని' సినిమా తో మొదలైన తన హారర్ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. థానే సొంతగా డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన 'కాంచన' సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే, ప్రతి సీక్వెల్‌కి బడ్జెట్ పెంచుతూ పోతున్నాడు లారెన్స్. 2011లో 7 కోట్లతో నిర్మించిన 'కాంచన' మంచి లాభాలు తెచ్చి సూపర్ హిట్ గా నిలిచింది.

Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

ఆ తర్వాత 'కాంచన 2'తో మరోసారి సూపర్ సక్సెస్ అయ్యాడు లారెన్స్, తాప్సీ ఫీమేల్ లీడ్ గా చేసిన ఈ మూవీని 17 కోట్లతో నిర్మించారు. అయితే  100 కోట్ల పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్ గా నిలిచి, ఈ కాంచన సిరీస్‌లోనే అత్యధిక వసూళ్లు తీసుకున్న సినిమా అయింది. 'కాంచన 3' కూడా మంచి ఫలితాలు సాధించింది, కానీ థర్డ్ పార్ట్‌కి ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. కంటెంట్ కొంచెం బలహీనంగా ఉందనే విమర్శలు రావడం, అలాగే రొటీన్ కథలాగా జనాలు ఫీల్ అవ్వడంతో 'కాంచన 3' మిక్స్డ్ టాక్ తో ఒక మోస్తరు హిట్ గా గట్టెక్కేసింది.

ఏకంగా 70 కోట్ల బడ్జెట్ తో

అయితే, ఈ సారి 'కాంచన 4' కోసం లారెన్స్ బడ్జెట్ పెంచేసాడు అని టాక్ వినిపిస్తుంది. దాదాపు ఆరేళ్ల తర్వాత నాల్గవ భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు లారెన్స. 'కాంచన 4' ని ఏకంగా 70 కోట్ల బడ్జెట్(Kanchana 4 Budget) తో తీస్తున్నాడట. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట లారెన్స్.

ఈ సారి సరికొత్త కంటెంట్ తో,  గతంలోని మూడు భాగాలకు మించి ఈ సీక్వెల్ ఉండేలా అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు లారెన్స్. ఈ చిత్రంలో 'బధిర' యువతిగా పూజా హెగ్డే, మరో ముఖ్యమైన పాత్రలో నోరా ఫతేహి ఎంపికైనట్లు కూడా తెలుస్తోంది.

Also Read: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు