PUshpa-2: బొమ్మ బ్లాక్ బస్టర్.. ఐకాన్‌స్టార్‌ నటవిశ్వరూపం అదుర్స్

పెట్టిన మొత్తానికి డబుల్ కాదు అంతకంటే ఎక్కువే కిట్టింది అంటున్నారు పుష్ప–2 చూసివచ్చినవారు. వెయ్య కోట్లు కాదు.. దానికి రెట్టింపు వసూలు చేస్తుంది అని చెబుతున్నారు. బొమ్మ బ్లార్ బస్టర్ హిట్ అంటూ అల్లు అర్జున్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
11

మూడేళ్ళ తర్వాత రిలీజ్ అయింది. బన్నీ ఫ్యాన్స్‌తో పాటూ మొత్తం దేశమంతా ఎదురు చూసిన సినిమా పుష్ప–2.  అల్లు అర్జున్ ను నేషనల్ స్టార్ చేసిన పుష్ప సీక్వెల్ ఇంకెన్ని సంచలనాలను సృషటిస్తుందో అని అందరూ ఎదురు చూశారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్, పాటలు మరింత హైప్‌ను పెంచాయి. దానికి తోడు మూవీ టీమ్ దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసింది. ఇది మూవీ రిఈజ్‌కు ముందే కోట్ల లాభాలను తీసుకొచ్చింది. హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన సినిమాగా పుష్ప–2 రికార్డ్ క్రియేట్ చేసింది. 

మొట్టమొదటి రివ్యూ ఫ్రమ్ ఉమైర్ సంధూ..

ఇప్పుడు వరల్డ్‌ వైడ్‌గా పుష్ప–2 బెనిఫిట్ షోస్, స్పెషల్ షూస్ పడిపోయాయి. అంచనాలకు తగ్గట్టుగానే మూవీ రివ్యూస్ కూడా వస్తున్నాయి. అల్లు అర్జున్ చించేశాడని చెబుతున్నారు మూవీ చూసివచ్చినవాళ్ళు. మరోవైపు ట్విట్టర్‌‌లో కూడా పుష్ప–2 మూవీని ఎత్తేస్తున్నారు. అందరి కంటే ముందు సన్సేషల్ రివ్యూయర్ ఉమైర్ సంధూ రివ్య వచ్చేసింది ఎప్పటిలానే. అతనైతే ఇలాంట సినిమా మరొకటి ఉండదు అంటూ రివ్యూ ఇచ్చేశాడు. మూవీలో బన్నీ, రష్మిక ఒక ఎత్తైతే...ఫాహద్ ఫాజిల్ మరొక ఎత్తని...అద్భుతంగా యాక్షన్ చేశాడని చెప్పాడు. అతని క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పాడు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ అద్భుతమైన నటనతో అదరగొట్టారని ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ ఇప్పుడు నంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరో అంటూ చెప్పుకోవచ్చారు. ఈ సినిమా విషయంలో ఎవరు కూడా జలసీగా ఫీల్ అవ్వద్దు అని అందరూ సపోర్ట్ చేయాలని తెలిపారు.

దీంతో పాటూ పుష్ప–2 మూవీ రివ్యూలతో ట్విట్టర్ మారుమోగిపోతోంది.  భారీ బ్లాకబస్టర్‌‌తో ఈ ఏడాది ముగించారని అంటున్నారు. సుకుమార్ డైరెక్షన్ అధిరిపోయిందని..అల్లు అర్జున ఇరగదీశాడని చెబుతున్నారు. అయితే దీంతో పాఊ కొంత మిక్సిడ్ టా కూడా పార్లల్‌గా నడుతోంది. హైప్ ఇచ్చినంత ఏమీ లేదని..మొదటి పార్టే ఇంకా బావుందని అంటున్నారు కొంత మంది. ఫస్ట్ హాప్ అయితే చాలా బాగుందని...సెకండ్ హాఫ్ అంత బాగా నడపించలేకపోయారని మరికొంత మంది రివ్యూలు రాశారు. ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటవిశ్వరూపం, సుకుమార్‌ డైరెక్షన్‌ అదిరిపోయింది. ఇండియాలోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీ పుష్ప 2 అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు.

 

Also Read: Pushpa-2: పుష్ప–2 ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్..

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు