ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. డిసెంబర్ 5 న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ చిత్రం ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా "పుష్ప2: ది రూల్" నిలిచింది. THE BIGGEST INDIAN FILM creates HISTORY at the box office ❤️🔥#Pushpa2TheRule grosses 294 CRORES worldwide on Day 1 making it THE HIGHEST OPENING DAY in Indian Cinema 💥💥💥#Pushpa2BiggestIndianOpenerRULING IN CINEMAS Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1… pic.twitter.com/uDhv2jq8dc — Mythri Movie Makers (@MythriOfficial) December 6, 2024 ఇది కూడా చదవండి: నిఖేశ్‌కుమార్ ఫ్రెండ్ లాకర్‌లో కిలోన్నర బంగారం, వజ్రాభరణాలు! RRR రికార్డ్ బ్రేక్.. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.294 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకు 'RRR' మూవీ అత్యధికంగా రూ.223 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. 'పుష్ప2' ఆ రికార్డును బ్రేక్ చేసి రూ.294 కోట్లతో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వాటా ఉంటే ఆ తర్వాత బాలీవుడ్ ఉంది. అమెరికాలోనే సుమారు రూ. 35 కోట్ల వరకు రాబట్టినట్లు నిర్మాణసంస్థ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్‌లో ఈ సినిమాను విడుదల చేయగా.. అల్లు అర్జున్ దెబ్బకు ఇప్పటి వరకు ఉన్న పాత రికార్డ్స్ అన్ని బద్దలైపోతున్నాయి. ఇది కూడా చదవండి: రాజ్యసభలో కరెన్సీ నోట్ల కలకలం.. దొరికిన కాంగ్రెస్ ఎంపీ Also Read: సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1785 ఖాళీలు..అర్హతలు, చివరి తేదీ వివరాలు ఇవే! Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్