NTR Dragon: 'పాలిపోయిన ముఖంతో.. బక్కచిక్కిపోయి'.. ఎన్టీఆర్ పై ప్రశాంత్ నీల్ షాకింగ్ కామెంట్స్!

డ్రాగన్ సినిమా కోసం ఎన్టీఆర్ కేవలం 4 నెలల్లో సుమారు 15 కిలోలు తగ్గి సన్నబడ్డారని ప్రశాంత్ నీల్ తెలిపారు. ఆరోగ్య సమస్యలు కనిపించడంతో బరువు తగ్గడం ఆపమని చెప్పినా ఎన్టీఆర్ వినలేదని తెలిపారు. పాత్ర కోసం ‘ఏదైనా చేస్తా’ అని చెప్పి పూర్తి డెడికేషన్ తో ఈ సినిమా చేసారని తెలిపారు.

New Update
NTR Dragon

NTR Dragon

NTR Dragon: ఎన్టీఆర్ డ్రాగన్  పై అంచనాలు ఇప్పటికే భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డాడో దర్శకుడు ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ, సినిమా పాత్ర కోసం ఎన్టీఆర్ చాలా తక్కువ సమయంలోనే దాదాపు 15 కిలోల బరువు తగ్గారని చెప్పారు. కేవలం 4 నెలల్లోనే ఆయన శరీరం చాలా సన్నబడిపోయిందని, ఒక దశలో ఆయన చాలా అలసిపోయినట్లు, ఆరోగ్యం క్షీణించినట్లు కనిపించారని తెలిపారు.

అది చూసి తాను నిజంగా షాక్ అయ్యానని, వెంటనే బరువు తగ్గే ప్రాసెస్ ఆపేయమని చెప్పానని నీల్ చెప్పారు. కానీ ఎన్టీఆర్ మాత్రం వినలేదని అన్నారు.

ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన భార్య, అలాగే సినిమా టీమ్ కూడా తనపై కొంత అసహనం వ్యక్తం చేశారని ప్రశాంత్ నీల్ గుర్తు చేసుకున్నారు. అందరూ కలిసి ఎన్టీఆర్‌ను జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పటికీ ఆయన మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదని తెలిపారు.

“ఈ సినిమా కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధం” అని ఎన్టీఆర్ చెప్పిన మాటలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని నీల్ అన్నారు. పాత్ర కోసం ఆయన చూపించిన డెడికేషన్ అద్భుతమని కూడా ప్రశాంత్ నీల్ ప్రశంసించారు.

ఈ విషయాలు బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన కష్టం చూసి గర్వంగా ఫీల్ అవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు