Prabhas Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన "స్పిరిట్" మేకర్స్!

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా ఆలస్యం అవుతుందనే రూమర్లకు టీమ్ చెక్ పెట్టింది. షూటింగ్ సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అడ్వాన్స్ టెక్నికల్ క్వాలిటీతో రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదలకు సిద్ధమవుతోంది.

New Update
Prabhas Spirit

Prabhas Spirit

Prabhas Spirit: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ Sandeep Reddy Vanga కాంబినేషన్‌లో వస్తున్న స్పిరిట్ "Spirit" సినిమా గురించి తాజాగా మంచి అప్డేట్ బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని, ప్రభాస్ డేట్స్ సర్దుబాటు కాలేకపోతున్నాయని వార్తలు వచ్చాయి. దీంతో సినిమా వాయిదా పడుతుందేమో అన్న సందేహం అభిమానుల్లో ఏర్పడింది.

అయితే ఈ రూమర్లన్నింటికీ చెక్ పెట్టుతూ సినిమా టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం షూటింగ్ ప్లాన్ ప్రకారం సరిగానే సాగుతోందని, ఎలాంటి పెద్ద సమస్యలు లేవని సమాచారం. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నారని, సినిమాను క్వాలిటీకి ఏమాత్రం రాజీ పడకుండా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడానికి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ముఖ్యమైన షూటింగ్ భాగాలన్నింటినీ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించనున్నారు.

ముందుగా ప్రకటించినట్లే ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ వార్తతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్పిరిట్ "Spirit" ఒక సాధారణ కమర్షియల్ సినిమా మాత్రమే కాదు. టెక్నికల్‌గా కూడా చాలా హై లెవెల్‌లో ఉండబోతుందని సమాచారం. సందీప్ రెడ్డి వంగా స్టైల్‌లో ఉండే యాక్షన్, ఎమోషన్ ఈ సినిమాలో బలంగా కనిపిస్తాయని అంటున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మేకింగ్, విజువల్స్ చాలా అడ్వాన్స్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. హాలీవుడ్ స్థాయికి దగ్గరగా టెక్నికల్ క్వాలిటీతో ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్.

Advertisment
తాజా కథనాలు