/rtv/media/media_files/2025/03/20/vthIfMKVB3TxtG4GwcrC.jpg)
Raja Saab Teaser
Raja Saab Teaser: ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Director Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The Raja Saab) గురించి ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చింది. మొదట ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కానుంది అని మేకర్స్ ప్రకటించినప్పటికీ, అనేక కారణాలతో ఏప్రిల్ రిలీజ్ వాయిదా పడింది. అయితే సినిమా విడుదల తేదీపై ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేదు.
Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్2: ఎంపురాన్' ట్రైలర్..!
ఏప్రిల్లో టీజర్..!
కానీ, సెప్టెంబరులో లేదా అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. రాజాసాబ్ టీమ్ మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తోంది. ముఖ్యంగా టీజర్ విడుదలకి సంబంధించిన పనులు. ఈ టీజర్‌ను వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
'ది రాజాసాబ్'ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో ముద్దుగుమ్మలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ మరియు రిద్ధి కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో సంజయ్ దత్ కన్పించనున్నారు.
Also Read: నాని 'గే' నా..? టాలెంటెడ్ హీరోని ట్రాన్స్ జెండర్ చేసారు కదరా..!
ప్రభాస్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని మారుతీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అంచనాలు మించే ఉంటుంది తప్ప అసలు తక్కువ కాదు అని మారుతీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే మరి వచ్చే నెలలో రిలీజ్ చేసే టీజర్ ఫ్యాన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!