Prabhas Spirit: "స్పిరిట్"లో ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ వైరల్.. నిజమా? ఏఐ నా? అభిమానుల్లో గందరగోళం!

ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది, తాజాగా ఆ ఫోటో ఫ్రంట్ లుక్ వైరల్ అవుతోంది అయితే అది ఏఐ నా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

New Update
Prabhas Spirit

Prabhas Spirit

Prabhas Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas నటిస్తున్న సినిమాల్లో ప్రస్తుతం ఎక్కువ హైప్ ఉన్న ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. ఈ చిత్రాన్ని Sandeep Reddy Vanga తెరకెక్కిస్తున్నారు. ఆయన సినిమాల్లో హీరోలను చూపించే స్టైల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందుకే ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

కొత్త సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఆ పోస్టర్‌లో ప్రభాస్ గాయాలతో, శరీరానికి కట్లు కట్టుకుని, చేతిలో మద్యం బాటిల్ పట్టుకుని కనిపించారు. ఎదురుగా హీరోయిన్ తృప్తి డిమ్రి Tripti Dimri సిగరెట్ వెలిగిస్తున్న సీన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. పోస్టర్‌లో కనిపించిన రా లుక్ చూసి అభిమానులు గూస్‌బంప్స్ ఫీల్ అయ్యారు.

ఇప్పటివరకు బ్యాక్ లుక్ మాత్రమే చూపించారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్రంట్ లుక్ లీక్ అయ్యిందనే ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. అయితే అది నిజంగా సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన ఫోటోనా? లేక ఏఐతో తయారు చేశారా? అన్న సందేహం అందరిలో ఉంది.

ఈమధ్య ఏఐ ఫోటోలు ఎక్కువగా రావడం వల్ల అసలు లీక్ ఏది, ఫేక్ ఏది అన్నది గుర్తించడం కష్టం అవుతోంది. అందుకే ఈ ఫోటోను షేర్ చేయడానికి కూడా అభిమానులు కాస్త జాగ్రత్త పడుతున్నారు. గతంలో లీక్ అయిన లుక్స్ చాలా హడావుడి చేసేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

మరోవైపు సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. విడుదల తేదీని ముందే అనౌన్స్ చేసాడు సందీప్ వంగా. అయితే ప్రభాస్ డేట్స్ విషయంలో కాస్త గందరగోళం ఉందని టాక్. ఆయన మరో సినిమా ‘ఫౌజీ’కి డేట్స్ ఇవ్వాలా? లేక ‘స్పిరిట్’కే ప్రాధాన్యం ఇవ్వాలా? అన్నది కొంత సమస్య ఉందట.

ఇంకా మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ప్రభాస్ తండ్రి పాత్ర కోసం మొదట చిరంజీవి Chiranjeevi ను సంప్రదించారనే ప్రచారం ఉంది. అయితే ఆయన ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పాత్ర కోసం మమ్ముట్టి Mammootty పేరు వినిపిస్తోంది. ఇది నిజమైతే సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది.

‘స్పిరిట్’ ప్రతి చిన్న అప్డేట్‌తోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రభాస్ కెరీర్‌లో ఇది ఒక డిఫరెంట్ మాస్, ఎమోషన్ కలిసిన సినిమా అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. సినిమా నుండి మరిన్ని అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అప్పటివరకు ఈ లీక్ లపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతూనే ఉంటాయి.

Advertisment
తాజా కథనాలు