/rtv/media/media_files/2026/04/25/darling-4k-collections-2026-04-25-14-52-29.jpg)
Darling 4k Collections
Darling 4k Collections: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ Prabhas నటించిన సూపర్ హిట్ లవ్ ఎంటర్టైనర్ డార్లింగ్ Darling సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చి మంచి కలెక్షన్లు సాధిస్తోంది. 2010లో వచ్చిన ఈ సినిమా, దాదాపు 16 సంవత్సరాల తర్వాత 4K క్వాలిటీతో ఏప్రిల్ 23, 2026న రీ-రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన ప్రీమియర్స్ దగ్గర నుండే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.
మొదటి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 7.59 కోట్ల గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అలాగే 2 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. కేవలం రీ-రిలీజ్ సినిమాగా ఈ స్థాయి కలెక్షన్లు రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
2Days Worldwide Gross 9.36CR 🔥
— Darling4K (@KedarFilms) April 25, 2026
KING 👑 SIZE RAMPAGE ❤️🔥❤️🔥#Darling4K#Prabhaspic.twitter.com/0vBFjnvThw
రెండో రోజు ముగిసే సరికి మొత్తం కలెక్షన్లు రూ. 9.36 కోట్లకు చేరాయి. ఈ వేగం చూస్తే ఈ సినిమా చాలా సులభంగా రూ. 10 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు.
All set to cross 10CR today ❤️🔥🔥 #Darling4Khttps://t.co/9JD2uPQGcZ
— Daya Arjun (@DayaArjun2) April 25, 2026
రీ-రిలీజ్ సినిమాల పరంగా చూస్తే, ఇది రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో Baahubali: The Beginning ఉంది, అది మొదటి రోజే రూ. 19.65 కోట్లు వసూలు చేసింది. అయినప్పటికీ “డార్లింగ్” ఈ రికార్డ్ దగ్గరికి చేరుకోవడం గొప్ప విషయమే.
Also Read: రీ-రిలీజ్ రికార్డులన్నీ ఔట్.. ఈ అరాచకం ఏంది సామీ!
ఈ సినిమా వల్ల మళ్లీ ప్రభాస్‌కు “డార్లింగ్” అనే పేరు ఎందుకు వచ్చిందో గుర్తు వచ్చింది. ఆయన స్టైల్, కామెడీ టైమింగ్, లవ్ ట్రాక్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా యువత, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం గమనార్హం.
ఓవర్సీస్‌లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజే దాదాపు $32,093 వసూలు చేసింది. ఇందులో నార్త్ అమెరికా నుంచి $20,962, యూకే నుంచి £7,708, ఆస్ట్రేలియా నుంచి సుమారు A$1,000 వచ్చాయి.
అలాగే ఈ సినిమా రీ-రిలీజ్ కలెక్షన్లు పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన “గబ్బర్ సింగ్”, మహేష్ బాబు Mahesh Babu నటించిన “ఖలేజా” వంటి సినిమాల రీ-రిలీజ్ రికార్డులను కూడా దాటింది.
4K ప్రింట్, మెరుగైన సౌండ్ వల్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగింది. 16 సంవత్సరాల పాత సినిమా అయినప్పటికీ ఇంకా అదే క్రేజ్ ఉండటం విశేషం. ప్రభాస్ అభిమానులకు ఇది ఒక పండుగలా మారింది.
ఈ విజయంతో భవిష్యత్తులో మరిన్ని పాత హిట్ సినిమాలు కూడా రీ-రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Follow Us