Baahubali Re Release: 50 కోట్ల సునామీ..! రీ-రిలీజ్‌ల గేమ్‌లో కూడా ‘బాహుబలి’ టాప్‌..

బాహుబలి సినిమా రీ-రిలీజ్‌లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాప్‌లో నిలిచింది. కానీ ఇతర సినిమాలకు డే 1 మంచి ఓపెనింగ్స్ ఉన్నా 10 కోట్ల మార్క్ కూడా దాటలేకపోతున్నాయి. ఇలా రీ-రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్నా, బాహుబలి రికార్డు మాత్రం ఇంకా బ్రేక్ కాలేదు.

New Update
Baahubali Re Release

Baahubali Re Release

Baahubali Re Release: రీ-రిలీజ్ ట్రెండ్‌లో ఇప్పటికీ అగ్రస్థానంలో నిలిచిన సినిమా బాహుబలి ఈ చిత్రం రీ-రిలీజ్‌లో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మరోసారి తన శక్తిని చూపించింది. ఇప్పటివరకు రీ-రిలీజైన ఏ సినిమా కూడా డబుల్ డిజిట్ గ్రాస్ స్థాయిని అందుకోలేకపోవడం దీనికి ప్రత్యేకతను తెచ్చింది.

ఈ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలైనప్పుడు కూడా కొత్త సినిమా వచ్చినట్టే అభిమానులు థియేటర్లకు చేరుకున్నారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషన్స్ అన్నీ ఇప్పటికీ అదే స్థాయిలో పని చేస్తుండటం ఈ సినిమాకి ఉన్న గొప్పతనాన్ని చూపిస్తుంది.

Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!

ఇటీవల చాలా సినిమాలు రీ-రిలీజ్‌లో మంచి ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి. కానీ మొదటి రోజు తర్వాత ఆ వేగం కొనసాగించడం మాత్రం కష్టమవుతోంది. ఉదాహరణకు మురారి Murari, ఖలేజా Khaleja వంటి సినిమాలు మొదటి రోజు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా, తర్వాత కలెక్షన్లు తగ్గిపోయాయి. చివరికి రూ.8 నుంచి 9 కోట్ల మధ్యే ముగిశాయి.

ఇక prabhas ప్రభాస్ డార్లింగ్ Darling రీ-రిలీజ్ మాత్రం దాదాపు రూ.10 కోట్ల పైనే వసూలు చేసి సత్తా  నిరూపించుకుంది. డార్లింగ్ నాస్టాల్జియా ను థియేటర్లలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు ప్రేక్షకులు.

Also Read: ట్రిపుల్ రోల్ లో ప్రభాస్! కల్కి 2 క్రేజీ అప్‌డేట్

జల్సా Jalsa, పోకిరి Pokiri, ఖుషి Kushi వంటి సినిమాలు హౌస్‌ఫుల్ షోస్‌తో థియేటర్లకు పండగ వాతావరణం తీసుకొచ్చాయి. ఇక తెలుగు మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా రీ-రిలీజ్ ట్రెండ్ బాగానే ఉంది. 

హిందీలో Sholay, Dilwale Dulhania Le Jayenge, Gadar సినిమాలు కూడా రీ-రిలీజ్‌లో మంచి రెస్పాన్స్ పొందాయి. తమిళంలో Ghilli, Padayappa, Baasha వంటి చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి.

Also Read: సంచలనానికి 9 ఏళ్ల! ‘బాహుబలి 2’ సృష్టించిన చరిత్ర ఇదే!!

రీ-రిలీజ్‌లో చాలా సినిమాలు రూ.10 కోట్ల మార్క్ దాటకపోయినా, రూ.5 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం కూడా పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఇది థియేటర్లకు మళ్లీ ఊపిరి పోసేలా చేస్తోంది. ఎగ్జిబిటర్స్, బయ్యర్స్‌కి కూడా లాభాలు తెస్తోంది. ప్రస్తుతం రీ-రిలీజ్ రేస్‌లో ‘బాహుబలి’ అగ్రస్థానంలో ఉంది. ఈ రికార్డును దాటే సినిమా ఏదో చూడాలి.

Advertisment
తాజా కథనాలు