Prabhas: 'ధురంధర్' థియేటర్లో ప్రభాస్ సందడి.. పబ్లిక్ తో కలిసి సినిమా చూసిన డార్లింగ్!

“ధురంధర్: ది రివెంజ్” భారీ విజయంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమాను ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా హైదరాబాద్‌లో ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో వీక్షించారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఇలా పబ్లిక్‌లో సినిమా చూడటం విశేషం.

New Update
Prabhas

Prabhas

Prabhas: ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద “ధురంధర్: ది రివెంజ్” సినిమా భారీ విజయంతో దూసుకుపోతోంది. మార్చి 19న విడుదలైన ఈ స్పై యాక్షన్ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందుతూ భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బ్రేక్ చేస్తూ, మరిన్ని రికార్డుల వైపు ముందుకు సాగుతోంది.

అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూసి అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో ఆయన ఈ మూవీని సాధారణ ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. ప్రభాస్‌తో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాను చూసారు. వీరిద్దరూ కలిసి థియేటర్‌లో కూర్చుని సినిమా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: “మాస్... మాస్... మాస్...” “రాకా” ఫస్ట్ లుక్ పోస్టర్ పై షారుక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Prabhas Watched Dhurandhar 2

సాధారణంగా స్టార్ హీరోలు ప్రైవేట్ స్క్రీనింగ్‌లో సినిమాలు చూస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడడం చాలా అరుదుగా జరుగుతుంది. బాహుబలి తర్వాత ఆయన ఇలా పబ్లిక్‌లో సినిమా చూడటం చాలా కాలం తర్వాత జరిగింది. అందుకే ఇది అభిమానులకు మరింత ప్రత్యేకంగా అనిపించింది.

Also Read: పెద్దిలో స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ తో మానస వారణాసి!

ఇప్పుడు ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి “స్పిరిట్” అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, మధ్యలో టైం తీసుకుని “ధురంధర్” చూడటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ప్రభాస్ ప్రేక్షకుల రెస్పాన్స్ ను దగ్గరగా గమనించినట్లు తెలుస్తోంది.

ఇక “స్పిరిట్” సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఇలా థియేటర్‌లో ప్రేక్షకుల మధ్యకు వచ్చి సినిమా చూడటం వల్ల, ఆయన తన కొత్త సినిమాను ఇంకా బెటర్‌గా చేయాలనే ఉత్సాహంలో ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన ప్రభాస్, “స్పిరిట్”తో మరో పెద్ద హిట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు.

Advertisment
తాజా కథనాలు