/rtv/media/media_files/2026/05/28/peddi-pre-bookings-2026-05-28-10-34-06.jpg)
Peddi Pre Bookings
Peddi Pre Bookings: టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి. రామ్ చరణ్(Ram Charan) హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో భారీ హంగామా మొదలుపెట్టింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షో ప్రీ సేల్స్ ద్వారా ‘పెద్ది’ $575K కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఇప్పటివరకు 20 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఇంకా ప్రీమియర్ షోలకు దాదాపు వారం రోజులు సమయం ఉండటంతో, రాబోయే రోజుల్లో ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రామ్ చరణ్‌తో పాటు ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందిస్తున్న మ్యూజిక్‌పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమాపై మంచి బజ్ ఉండటంతో, విడుదలకు ముందే ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే దిశగా దూసుకెళ్తోంది.
Follow Us