/rtv/media/media_files/2026/06/03/peddi-bookings-2026-06-03-14-39-46.jpg)
Peddi Bookings
Peddi Bookings: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన భారీ చిత్రం "పెద్ది" రేపు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే తెలంగాణలో ప్రీమియర్ షోలకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఇప్పుడు డిస్ట్రిక్ట్, బుక్‌మైషో వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తమ సీట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
టికెట్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుండటంతో, సినిమా విడుదల తర్వాత సినిమా ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో కనిపిస్తోంది.
#PEDDI Ready to enter the GROUND from today ⚡️
— Mythri Movie Distributors LLP (@MythriRelease) June 3, 2026
Grand PREMIERES and full fledged bookings open now 💥💥💥https://t.co/YZtaj58HBO
Book your tickets ⚡️#PEDDI Grand Premieres from today, Grand Release On June 4th across Nizam through @mythrirelease 💥💥 pic.twitter.com/s0dX7zXCj8
స్పోర్ట్స్ నేపథ్యంతో పాటు యాక్షన్, భావోద్వేగ అంశాలను కలిపి రూపొందించిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మించగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Follow Us