Peddi Bookings: బుక్‌మైషోలో ‘పెద్ది’ గాడి జోరు.. 24 గంటల్లో రికార్డ్ టికెట్ సేల్స్..

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, గత 24 గంటల్లో బుక్‌మైషోలో 1.27 లక్షలకు పైగా టికెట్ సేల్స్ జరుపుకుంది.

New Update
Peddi Bookings

Peddi Bookings

Peddi Bookings: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. జూన్ 4, 2026న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.

గ్రామీణ క్రీడల నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కొన్ని వర్గాల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ, సినిమా కలెక్షన్లపై వాటి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.

గత 24 గంటల్లో మాత్రమే ‘పెద్ది’కి బుక్‌మైషోలో 1.27 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. సాధారణంగా వర్కింగ్ డే అయిన బుధవారం రోజున కూడా ఈ స్థాయిలో టికెట్ సేల్స్ రావడం సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని చూపిస్తోంది.

పాజిటివ్ టాక్, మంచి మౌత్ పబ్లిసిటీ కారణంగా థియేటర్లలో సినిమా స్థిరమైన వసూళ్లను నమోదు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రం త్వరలోనే బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలాగే ఈ వారం పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ‘పెద్ది’కి కలిసొచ్చే అంశంగా మారింది. దీంతో రాబోయే రోజుల్లో కూడా సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ సినిమాలో జాన్వీ కపూర్, శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Advertisment
తాజా కథనాలు