Ustaad Bhagat Singh: పవన్ 'ఉస్తాద్'కు రిలీజ్ కష్టాలు.. టైటిల్ మారిందా? కథ కూడా మారిందా?

పవన్ కళ్యాణ్-హరీశ్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలను ‘టాక్సిక్’ వాయిదా పడటం కారణంగా మార్చి 26 నుంచి ఉగాది మార్చి 19కి ముందుకు తీసుకురావాలనే చర్చ జరుగుతోంది. కథలో మార్పులు చేసి పవర్‌ఫుల్ పోలీస్ పాత్రతో సినిమా సిద్ధమైందని టాక్ నడుస్తోంది.

New Update
Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విడుదల తేదీపై కొత్త చర్చ మొదలైంది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు విడుదల తేదీని మార్చి 19కి ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

మార్చి 19న ఉగాది పండుగ ఉంది. పండుగ రోజు సినిమా వస్తే మంచి ఓపెనింగ్ వస్తుందని టీమ్ భావిస్తోందట. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు కూడా సిద్ధంగా ఉండాలని సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇక మరోవైపు, మార్చి 19కి రావాల్సిన కన్నడ చిత్రం ‘టాక్సిక్’ వాయిదా పడింది. ఆ సినిమా జూన్ 4కి మార్చడంతో ఆ తేదీ ఖాళీ అయింది. అందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీమ్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోందని అంటున్నారు.

అయితే అదే సమయంలో ‘ధురంధర్ 2’ కూడా మంచి క్రేజ్ ఉన్న సినిమా. అది కూడా ఆ సమయానికే వస్తే పోటీ ఎలా ఉంటుందో చూడాలి. నిజంగా క్లాష్ ఉంటుందా? లేక ఇంకేదైనా మార్పు ఉంటుందా? అనేది త్వరలో స్పష్టత వస్తుంది.

టైటిల్ మారిందా? కథ కూడా మారిందా?

మొదట ఈ సినిమాను ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే పేరుతో ప్రకటించారు. తరువాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మార్చారు. దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో వివరాలు చెప్పారు.

ఆయన చెప్పిన మాటల్లోకి వస్తే..
‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా పోలీస్ గెటప్‌లో కనిపించారు. ఈసారి కాస్త కొత్తగా ప్రయత్నించాలనుకుని మొదట కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కథను ప్లాన్ చేశామని చెప్పారు. ‘భవదీయుడు’ అనే పదం అర్థం చాలా మందికి తెలియదని, సోషల్ మీడియాలో కూడా ఆ విషయం గురించి సందేహాలు వచ్చాయని తెలిపారు. సినిమా పేరు సులభంగా అర్థమయ్యేలా ఉండాలని భావించి మార్పు చేశామని చెప్పారు.

అలాగే అభిమానులు తమ కాంబినేషన్ నుంచి మాస్ ఎలిమెంట్స్ ఆశిస్తున్నారని, కాలేజ్ కథలో అవి బాగా సెట్ కాలేదని అన్నారు. అందుకే మరో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రతో కొత్త కథను సిద్ధం చేశామని తెలిపారు. సినిమా మొదట్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో ప్రేక్షకులకు అర్థమవుతుందని చెప్పారు.

పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి - ప్రమోషన్స్‌కు ప్లాన్ రెడీ

ఈ సినిమా షూటింగ్ పూర్తై, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగిసినట్లు సమాచారం. డైరెక్షన్ టీమ్ ఫైనల్ ఎడిట్‌ను రెండు సార్లు చూసి చెక్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఫస్ట్ కాపీ సిద్ధం కానుంది.

ప్రమోషన్స్ విషయంలో కూడా టీమ్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక డైలాగ్ అభిమానుల్లో జోష్ పెంచింది..
“నేను రంగంలోకి దిగే వరకే. ఒకసారి దిగితే మామూలుగా ఉండదు. మనల్ని ఎవరు ఆపలేరు” అనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ నెల 19న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి, ఉగాది రోజునే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలోకి వస్తుందా లేదా అనేది త్వరలో అధికారిక ప్రకటనతో తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు