/rtv/media/media_files/2026/03/24/ustaad-bhagat-singh-2026-03-24-07-57-36.jpg)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ Ustaad Bhagat Singh సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్స్ గణనీయంగా తగ్గిపోయాయి. సోమవారం నాటికి థియేటర్లలో ప్రేక్షకులు 50 శాతం కంటే తక్కువగా ఉండటం నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది.
పవన్ కళ్యాణ్ Pawan Kalyan హీరోగా వచ్చిన ఈ సినిమా మొదట మంచి ఓపెనింగ్స్ సాధించినా, ఆ తర్వాత కలెక్షన్స్ వేగం తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సినిమాకు 50 శాతం కంటే ఎక్కువ నష్టాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకు హరీష్ శంకర్ Harish Shankar దర్శకత్వం వహించారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి.
మొత్తానికి, పెద్ద అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. మరి ముఖ్యంగా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా కలెక్షన్స్ చాలా తక్కువగా ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ సినిమా ప్రీమియర్, ఫస్ట్ డే కలిపి కేవలం సుమారు 5.15 లక్షల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇది చాలా తక్కువ ఓపెనింగ్‌గా భావిస్తున్నారు.
దీంతో పోలిస్తే హరి హర వీర మల్లు Hari Hara Veera Mallu సినిమా ప్రీమియర్ రోజునే దాదాపు 8 లక్షల డాలర్లు వసూలు చేసింది. మొత్తంగా ఆ సినిమా నార్త్ అమెరికాలో సుమారు 1.25 మిలియన్ డాలర్లు సాధించింది.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మొత్తం రన్‌లో సుమారు 8 లక్షల డాలర్ల వద్దే ముగిసే అవకాశముందని చెబుతున్నారు. ఇది చాలా తక్కువగా భావిస్తున్నారు.
ఓవర్సీస్ హక్కుల కోసం ప్రాత్యంగిర సినిమాస్ దాదాపు 12 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది. అంటే బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 3 మిలియన్ డాలర్లు రావాలి. కానీ ప్రస్తుతం అన్ని దేశాల కలిపి గరిష్టంగా 1.2 మిలియన్ డాలర్లు మాత్రమే వస్తాయని అంచనా.
షేర్ లెక్కలో చూస్తే ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇది అడ్వాన్స్ డీల్ కావడంతో నిర్మాతలు కొంతవరకు సేఫ్ అవుతారు. అయినా ఈ సినిమా ఓవర్సీస్‌లో మాత్రం భారీ నష్టాలను చూపించే పరిస్థితి కనిపిస్తోంది.
Follow Us