Prabhas Spirit: ప్రభాస్ 'స్పిరిట్' డైరెక్షన్ టీమ్ లో స్టార్ హీరో కొడుకు..!

ప్రభాస్ పాన్-ఇండియా సినిమా Spirit లాంచ్ హైదరాబాద్ లో జరిగింది. సందీప్ రెడ్డి వంగ్ దర్శకత్వంలో, త్రిప్తి డిమ్రి వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కీలక పాత్రలలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే రవితేజ, త్రివిక్రమ్ కుమారులు డైరెక్షన్ అసిస్టెంట్‌గా చేరడం విశేషం.

New Update
Prabhas Spirit

Prabhas Spirit

Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘Spirit’ సినిమా లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లాంచ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై, మూవీకి క్లాప్‌బోర్డ్‌ని సమర్పించారు. ఈ లాంచ్ కార్యక్రమం చాలా గ్రాండ్‌గా జరిగింది.

Also Read: ఇది కదా మాకు కావాల్సింది..! మాస్ డాన్స్‌తో దుమ్ముదులిపిన ‘రెబల్ సాబ్’

లాంచ్ సమయంలో విడుదలైన క్రూ ఫొటోలలో డైరెక్షన్ విభాగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే రవి తేజా కుమారుడు మహాధాన్, త్రివిక్రమ్ కుమారుడు రిషి ఈ ప్రాజెక్ట్‌లో సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్స్‌గా చేరారు. మహాధాన్ చిన్నతనంలో అనిల్ రవిపూడి ‘రాజా ది గ్రేట్’లో చిన్నపటి  రవి తేజా పాత్రలో నటించినప్పటికీ, అతనికి డైరెక్షన్ నేర్చుకోవడంలో ఆసక్తి ఉంది. రిషి కూడా తన నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సందీప్ దగ్గర చేరాడు. 

Also Read: బిగ్‌బాస్‌ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా ?.. దీని అసలు కథ ఇదే

Spiritలో హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి నటిస్తున్నారు. ఆమెకు Animal సినిమాతో మంచి పేరు వచ్చింది. ప్రభాస్-త్రిప్తి జోడీ స్క్రీన్‌పై ఫ్రెష్ ఫీల్ ఇవ్వనుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా ఒక పాన్-ఇండియా యాక్షన్ థ్రిలర్ గా రూపొందుతోంది. ప్రభాస్ ఒక కఠినమైన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాను 9 భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ విధంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఆకర్షించేలా చిత్రీకరణ జరుగుతుంది.

Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?

సినిమాలో పెద్ద ఎత్తున యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్, 100 మంది ఫైటర్స్‌తో ప్రభాస్ చేసే యాక్షన్ సీన్ ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది. స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఈ యాక్షన్ సీన్ డిజైన్ చేశారు. మొత్తం సినిమా Animal స్టైల్ హై-ఒక్టేన్ యాక్షన్ అనుభవాన్ని ఇచ్చేలా రూపొందుతోంది. మేకర్స్ ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23) సందర్భంలో సౌండ్-స్టోరీ ఆడియో టీజర్ ను రిలీజ్ చేశారు. దీని వల్ల అభిమానుల్లో సినిమాపై పెద్ద ఆసక్తి నెలకొంది.

Also Read: మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలినిని రెండో పెళ్లి.. హగ్గుల కోసం రీ-టేక్‌లు!

రవి తేజా కుమారుడు మహాధాన్, త్రివిక్రమ్ కుమారుడు రిషి ‘Spirit’ ద్వారా డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇది వారిద్దరికీ భవిష్యత్తులో స్వయంగా డైరెక్ట్ చేసే అవకాశం కోసం గొప్ప స్టేజ్. Spirit ఒక గ్రాండ్ స్కేల్ సినిమా, ప్రభాస్ స్టార్ పవర్, సందీప్ రెడ్డి వంగ్ యాక్షన్, క్రియేటివ్ డైరెక్షన్ అందరిని ఆకర్షిస్తుంది. సినిమా పాన్ ఇండియా ప్రేక్షకుల కోసమే కాకుండా, అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకోని తెరకెక్కిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు