/rtv/media/media_files/2024/10/25/IMBxRGTMhRePsM4RmLmI.jpg)
జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'వార్ 2'. తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు . స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమాపై హిందీతో పాటూ తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు.
Ramp Ramp Shake Chesav @tarak9999 🔥🔥❤️🔥🥵😍🤩❤️🔥. #War2 pic.twitter.com/vjx5I9UmxS
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) October 25, 2024
సెట్స్ నుంచి ఎన్టీఆర్ ఫొటోలు లీక్ అయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ లీక్ అయిన ఫొటోలలో జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరిపోయింది. ఫొటోలో తారక్ ఆర్మీ షర్ట్ ధరించి ఉండడంతో సినిమాలో ఆయనది ఆర్మీ ఆఫీసర్ రోల్ ఏమోనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ షూటింగ్‌లో చాలా బిజీగా సెట్ లో ఉన్న వారితో మాట్లాడుతూ కనిపించారు.
Also Read : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్
Bollywood ki first 200CR & 250CR Opening istadu @tarak9999 #War2 💪🏻💥 pic.twitter.com/DPSblW9L2e
— Akthar (@Aktharfan) October 25, 2024
దెబ్బకు ట్రెండింగ్ లో..
తారక్ లుక్ అలా బయటికొచ్చిందో లేదో అప్పుడే అవి సోషల్ మీడియా ట్రెండింగ్ లో నిలిచాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫొటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్, హృతిక్ లపై యాక్షన్ దృశ్యాలతోపాటు ఓ పాటను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
The Yuddhbhoomi is set for the biggest War of all time.... 🔥 #Hrithikroshan x #JrNTR for #War2 pic.twitter.com/NtcC4A9hMg
— ᴿᴬᴹᴮᴼ 🆂🅰🆃🆈🅰 (@hr_SATYA_) October 25, 2024
వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్ తో బిజీగా ఉంటారట. ఆ తర్వాతే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : పొలిటికల్ ఎంట్రీపై 'సుప్రీం' హీరో కామెంట్స్.. ఫోకస్ అంతా దానిపైనే అంటూ
India Shake Adisthaaaamm #Devara tho Swords Muginchadu 🌊
— 𝐅𝐭. 𝐊 ʀ ɪ ꜱ ʜ ɴ ᴀ _ 𝐍 𝐓 𝐑 ™ 🌶️ (@KRISHLOVEsNTR) October 25, 2024
Now It's Time To Dealing Guns In #War2 🔥🔥❤️🔥🥵🥶🥶🥶 pic.twitter.com/rBjmRWUaVk