Ntr Fan: 'దేవర' చూసే వరకు బతికించండి..! అభిమాని వీడియో వైరల్ 'దేవర' సినిమా చూసేవరకు తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు తారక్ అభిమాని. ఏపీకి చెందిన కౌశిక్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతుండగా.. తమ బిడ్డ చివరి కోరిక నెరవేర్చాలని NTRను ప్రాధేయపడుతున్నారు కౌశిక్ తల్లిదండ్రులు. ఈ వీడియో వైరలవుతోంది. By Archana 12 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update ntr fan షేర్ చేయండి Ntr Devara: ప్లీజ్ సర్.. మా అబ్బాయిని బతికించండి.. సెప్టెంబర్ 27 వరకైనా బతికించండి..' ఇది ఓ జూనియర్ అభిమాని తల్లి బాధ.. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో హృదయాన్ని కలిచివేస్తోంది. చిన్నతనంలోనే క్యాన్సర్ బారిన పడ్డ తన కొడుకు చివరి కోరిక తీర్చాలని ఆ తల్లి మీడియా ముందుకొచ్చింది. 'దేవర' సినిమా చూసేవరకు నన్ను బతికించండి 'దేవర' సినిమా చూసేవరకు తనను బ్రతికించండి అని డాక్టర్లను వేడుకుంటున్నాడు తారక్ అభిమాని. ఏపీకి చెందిన కౌశిక్(19) బ్లడ్ క్యాన్సర్ తో బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక తాను బతకనని.. దేవర రిలీజ్ సెప్టెంబర్ 27 వరకైనా బతికించండని వైద్యులను వేడుకుంటున్నాడు. దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైనా కౌశిక్ తల్లిదండ్రులు.. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని అతని తల్లిదండ్రులు ఎన్టీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రాధేయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేవర చూసే వరకూ బతికించండి: అభిమానిAP కి చెందిన కౌశిక్ అనే @tarak9999 అభిమాని మృత్యువుతో పోరాడుతున్నాడుబ్లడ్ క్యాన్సర్‌తో బెంగళూరులోని కిడ్వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడుతాను బతకనని, దేవర సినిమా రిలీజ్ అయ్యే సెప్టెంబర్ 27 వరకైనా తనను బతికించాలని డాక్టర్లను వేడుకుంటున్నాడు… pic.twitter.com/KLgWfAzwRL — Milagro Movies (@MilagroMovies) September 12, 2024 సినిమా హీరోలను దేవుళ్లగా చూసే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ముందువరుసలో ఉంటాయి. ఇటు టాలీవుడ్లో ఎంతోమంది హీరోలకు ఫ్యాన్స్ లేరు..భక్తులే ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తారక్‌కు కూడా ఫ్యాన్స్‌ని ఎంతో గౌరవిస్తారు.. తన ఫ్యాన్స్ ఆపదలో ఉన్నప్పుడు గతంలో అనేకసార్లు జూనియర్ వారికి హెల్ప్ చేశారు. అలానే ఈ అబ్బాయికి కూడా తారక్ అండగా నిలుస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరోవైపు ఇటివలీ కాలంలో క్యాన్సర్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో యువత కూడా ఎక్కువగా ఉండడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. మనం తింటున్న ఫుడ్ ఐటెమ్స్‌తో పాటు జెనిటిక్పరంగానూ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి