Jailer 2: నెల్సన్ - రజనీ 'జైలర్ 2'కు హైటెక్ టచ్.. ఇంటర్నేషనల్ లెవెల్ ప్లాన్!

రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. కొన్ని కీలక సన్నివేశాలను ఐమ్యాక్స్ ఫార్మెట్‌లో షూట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ భారీ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

New Update
Jailer 2

Jailer 2

Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’పై కొత్త విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

తాజా వార్తల ప్రకారం, ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఐమ్యాక్స్ ఫార్మెట్‌లోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమాలు షూటింగ్ పూర్తైన తర్వాత ఐమ్యాక్స్ ఫార్మెట్‌కి మారుస్తారు. కానీ ‘జైలర్ 2’ మాత్రం షూటింగ్ దశలోనే ప్రత్యేక సాంకేతికతతో కొన్ని సీన్స్‌ను ఐమ్యాక్స్ కోసం తీసినట్లు సమాచారం.

ఈ విధంగా షూట్ చేయడం వల్ల సినిమాకు మరింత గ్రాండ్ లుక్ రావడంతో పాటు థియేటర్ అనుభూతి కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వేగంగా కొనసాగుతోంది.

సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం  సెప్టెంబర్ 10 లేదా 11న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

‘జైలర్ 2’లో రజనీకాంత్‌తో పాటు రమ్యకృష్ణ, మిర్ణా, శివరాజ్ కుమార్, మోహన్‌లాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి భాగం భారీ బ్లాక్‌బస్టర్ కావడంతో రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు