Neena Gupta : 66 ఏళ్ల వయసులో నీనా గుప్తా ప్రెగ్నెన్సీ.. ఆమె ఏం అన్నారంటే?

ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా 66 ఏళ్ల వయసులో గర్భం దాల్చారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై నీనా గుప్తా స్పందించారు.

New Update
neena guptha

ప్రముఖ బాలీవుడ్ నటి నీనా గుప్తా 66 ఏళ్ల వయసులో గర్భం దాల్చారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ పుకార్లపై నీనా గుప్తా స్పందించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిసెప్షన్ వేడుకకు ఆమె హాజరయ్యారు. అక్కడ దిగిన ఫోటోలు, వీడియోలలో ఆమెను చూసిన కొందరు నెటిజన్లు, నీనా గుప్తా గర్భవతి అంటూ ఆమె బేబీ బంప్ కనిపిస్తోందని చర్చ మొదలుపెట్టారు. 

ఆ వార్తలను నవ్వుతూ

అయితే ఈ రుమార్స్ పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నీనా గుప్తా, ఆ వార్తలను నవ్వుతూ కొట్టిపారేశారు. "నాకు ఇప్పుడు నిజ జీవితంలో 'బధాయి హో' (ఆమె నటించిన సినిమా, అందులో పెద్ద వయసులో గర్భం దాల్చే పాత్ర) తక్కువైంది" అంటూ చెప్పుకొచ్చారు. తాను గర్భవతిని కాదని, ఆ రోజు తాను కట్టుకున్న చీర మెటీరియల్ చాలా మందంగా ఉండటం వల్లే అలా కనిపించానని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ వయసులో తన ప్రెగ్నెన్సీ గురించి దేశమంతా చర్చించుకోవడం చూస్తుంటే, సమాజం మారుతోందని అర్థమవుతోందని, ఈ పుకార్లను చూసి తాను అసలు బాధపడటం లేదంటూ ఆమె వెల్లడించారు. 

నీనా గుప్తా జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1980లలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలని నిర్ణయించుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం. సమాజం నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా, తన కుమార్తె మసాబా గుప్తాను ఒంటరిగానే పెంచి పెద్ద చేశారు. ఎవరి సహాయం తీసుకోకుండా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు. చాలా కాలం తర్వాత, 2008లో వివేక్ మెహ్రా అనే చార్టర్డ్ అకౌంటెంట్‌ను ఆమె వివాహం చేసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు