Bloody Romeo: నాని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా ఇప్పట్లో లేనట్టే!

నాని సుజీత్ బ్లడీ రోమియో వాయిదా పడింది. ది ప్యారడైజ్ షూటింగ్ డిలే వల్ల నాని డేట్స్ అందుబాటులో లేకపోవడంతో సుజీత్ తన దృష్టిని ఇప్పుడు OG 2 స్క్రిప్ట్‌పై పెట్టారు. ‘బ్లడీ రోమియో’ 2027లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

New Update
Bloody Romeo

Bloody Romeo

Bloody Romeo: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని Nani ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. Srikanth Odela, Sujeeth, అలాగే మరికొంత మంది దర్శకులతో సాలిడ్ లైనప్ రెడీ చేసుకున్నాడు.

ఈ లైనప్‌లో ముఖ్యంగా అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా బ్లడీ రోమియో Bloody Romeo. అయితే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది.

Also Read: మోదీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టుకు దీదీ :  బెంగాల్లో హైటెన్షన్!

దీనికి ప్రధాన కారణం నాని ప్రస్తుతం నటిస్తున్న ది ప్యారడైజ్ The Paradise షూటింగ్‌లో ఆలస్యం కావడమే. ఈ సినిమా ముందుగా 2026 సమ్మర్‌లో రావాల్సి ఉండగా, క్వాలిటీ కోసం మేకర్స్ దాన్ని 2026 ఆగస్టు 21కి మార్చారు. దీంతో నాని మొత్తం కాల్ షీట్స్ ఈ సినిమాకే ఇవ్వాల్సి వచ్చింది.

దీంతో ‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభం ఆలస్యం అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది చివర్లో లేదా 2027లోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో నాని ఫ్యాన్స్ కొంత నిరాశకు లోనవుతున్నారు.

Also Read: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!

మరోవైపు ఈ ఆలస్యం కారణంగా దర్శకుడు సుజీత్ Sujeeth తన దృష్టిని మరో పెద్ద ప్రాజెక్ట్‌పై పెట్టినట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan నటించిన OG సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న OG 2 స్క్రిప్ట్ పనుల్లో సుజీత్ బిజీగా ఉన్నారు.

‘OG’ సక్సెస్ కావడంతో సీక్వెల్‌ను మరింత పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్న సుజీత్, నాని డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘బ్లడీ రోమియో’ను ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారని ఫిలింనగర్ టాక్.

Advertisment
తాజా కథనాలు