/rtv/media/media_files/2025/03/18/iftJkKdjZIzY85a8zF8r.jpg)
Court Movie Collections
Court Movie Collections: ప్రస్తుతం టాలీవుడ్ లో నాని(Nani) పేరు మారుమోగిపోతుంది. అందుకు కారణం నాని చేస్తున్న మూవీస్, హీరోగా అయినా, నిర్మాతగా అయినా నాని సినిమా అంటే హిట్ పడాల్సిందే. ఇండస్ట్రీలో ప్రస్తుతం నాని టైమ్ నడుస్తోంది. నాని పట్టిందల్లా బంగారమే . ముఖ్యంగా "కోర్ట్ - స్టేట్ వర్సస్ ఎ నోబడీ" సూపర్ సక్సెస్ తో నాని రేంజ్ మారిపోయింది. ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతోంది. సూపర్ హిట్ టాక్ తో ఇప్పటికే నాని కోర్ట్ మూవీ లాభాల బాట పట్టింది.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
అయితే, "కోర్ట్ - స్టేట్ వర్సస్ ఎ నోబడీ" సినిమా కేవలం రూ. 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా ఇప్పటివరకు థియేట్రికల్ రైట్స్ ద్వారా పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ ప్రాఫిట్ సాధించి థియేటర్స్ లో దూసుకుపోతుంది.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
కోర్ట్ మూవీ ఓటీటీ..
కోర్ట్ మూవీ ఓటీటీ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో నానికి రానున్న రోజుల్లో ఈ సినిమా మరింత లాభాలు తెచ్చిపెడుతుంది. ఇప్పటికే మూవీ బడ్జెట్‌లోని సగం మొత్తం డిజిటల్ రైట్స్ ద్వారా వసూలవ్వగా, థియేటర్ కలెక్షన్స్ పరంగా కూడా పెట్టిన బడ్జెట్ కంటే డబుల్ ప్రాఫిట్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఇలా థియేటర్ రైట్స్, డిజిటల్ రైట్స్ అన్ని చూసుకుంటే ఈ మూవీ నానికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది అనే చెప్పాలి.
Also Read: స్పీడ్ పెంచేసిన డ్రాగన్ బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతో రిపీట్..
రామ్ జగదేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రియదర్శి, శివాజీ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రమోషన్స్, మౌత్ టాక్ తో ఈ "కోర్ట్ - స్టేట్ వర్సస్ ఎ నోబడీ" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
Also Read: అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..