నందమూరి ఫ్యామిలీ నుంచి మరో ఎన్టీఆర్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన తారక్

నందమూరి కుటుంబం నుంచి కొత్త హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా అతని ఇంట్రో వీడియోను రిలీజ్ చేశారు.

New Update

తెలుగు సినీ పరిశ్రమ లో నందమూరి ఫ్యామిలీ కి భారీ గుర్తింపు ఉంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి తర్వాత ఆయన కుమారులు బాలకృష్ణ, హరికృష్ణ హీరోలుగా మెప్పించగా.. ఇప్పుడు బాలయ్యతో పాటూ హరికృష్ణ వారసులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో హీరోలుగా భారీ స్టార్ డం తో కొనసాగుతున్నారు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

అతను మరెవరో కాదు నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు.. తారక రామారావు.. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా తారక రామారావు కు సంబంధించి ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో అతను స్టైలిష్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.

Also Read : చైతూ - శోభిత పెళ్లి తేదీ ఖరారు.. ఎప్పుడు, ఎక్కడంటే?

 

‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై వైవీఎస్ చౌదరి సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తారక రామారావు మూవీ ఎంట్రీ పై జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆల్‌ ది బెస్ట్ చెబుతూ పోస్ట్‌ చేశారు. ఎన్టీఆర్ తన ట్వీట్‌లో రాస్తూ..'రామ్ మొదటి అడుగుకు  ఆల్ ది బెస్ట్. 

Also Read : 'కంగువా' మూవీ టీమ్ కు బిగ్ షాక్.. అతని ఆకస్మిక మరణంతో?

ఆ నమ్మకం నాకుంది..

ఈ సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీకు విజయం తప్పకుండా వస్తుంది. మీ ముత్తాత ఎన్టీఆర్ , తాత హరికృష్ణ , నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో  ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది' అంటూ పోస్ట్ చేశారు. దీంతో తారక్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

#ntr
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎం...

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment