/rtv/media/media_files/2026/04/29/akhil-lenin-2026-04-29-10-14-51.jpg)
Akhil Lenin
Akhil Lenin: యువ హీరో అఖిల్ అక్కినేని Akhil Akkineni నటిస్తున్న కొత్త సినిమా "లెనిన్" ‘Lenin’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే Bhagyashri Borse నటిస్తున్నారు. ఇది ఒక గ్రామీణ నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది.
ఈ సినిమా విడుదల తేదీపై ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న ‘పెద్ది’ ‘Peddi’ జూన్ 25, 2026న విడుదల కావడంతో, ‘లెనిన్’ సినిమా జూన్ 26 విడుదల మారుతుందనే ప్రచారం జరిగింది.
watched the first cut of our film LENIN last night.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 29, 2026
I say this with confidence and pride… you are about to witness a new AKHIL on June 26 2026.
mark the date!!!
see you in the theatres🔥
అయితే ఈ రూమర్స్‌కి స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగార్జున అక్కినేని Nagarjuna Akkineni. ఆయన మాట్లాడుతూ, ‘లెనిన్’ సినిమా అనుకున్న తేదీకి అంటే జూన్ 26, 2026న థియేటర్లలో విడుదల అవుతుందని ఖచ్చితంగా తెలిపారు. ఎలాంటి మార్పు ఉండదని కూడా స్పష్టం చేశారు.
అలాగే నాగార్జున ఈ సినిమా గురించి మరింత హైప్ పెంచారు. సినిమా ఫస్ట్ కట్ చూసిన తర్వాత తనకు చాలా నచ్చిందని చెప్పారు. ప్రేక్షకులు ఇందులో అఖిల్‌ను పూర్తిగా కొత్త రూపంలో చూస్తారని ఆయన నమ్మకంగా చెప్పారు. ఇది అఖిల్ కెరీర్‌లో ఒక కొత్త మలుపు అవుతుందని కూడా తెలిపారు.
ప్రస్తుతం నాగార్జున కూడా తన కొత్త సినిమా ‘King100’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన ‘లెనిన్’పై పూర్తి నమ్మకంతో ఉన్నారు.
ఈ సినిమాను నాగ వంశీతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ Sithara Entertainments నిర్మిస్తోంది. సంగీతాన్ని S. తమన్ S. Thaman అందిస్తున్నారు.
మొత్తానికి ‘లెనిన్’ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అఖిల్‌ను కొత్త అవతారంలో చూడబోతున్నామనే ఆశతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us