ఆ వార్తలు ఫేక్.. నాగచైతన్య టీమ్ కీలక ప్రకటన!

అక్కినేని నాగచైతన్య వెబ్‌సిరీస్‌ లో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ఇదంతా ఫేక్ ప్రచారమంటూ కొట్టిపారేసింది. చైతన్య ప్రస్తుతం ‘తండేల్‌’ మూవీపై దృష్టి పెట్టారని, ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది.

New Update
dreer3e

Naga Chaitanya: వెబ్‌సిరీస్‌ లో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై అక్కినేని నాగచైతన్య టీమ్ స్పందించింది. ప్రస్తుతం నటిస్తున్న 'తండేల్' తర్వాత వెబ్ సిరీస్ ప్రాజెక్టుకు సంతకం చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని చైతూ టీమ్‌ ఖండించింది. ఈ మేరకు వెబ్ సిరీస్ న్యూస్ అంతా ఫేక్ అంటూ కొట్టిపారేసింది.

ఇది కూడా చదవండి: ప్రభాస్ సినిమా కోసం నన్ను మోసం చేసారు.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్

ఇది కూడా చదవండి: సినీ పరిశ్రమతో భట్టి కీలక భేటీ.. అందుకు సిద్ధమంటూ సంచలన ప్రకటన!

'తొలి వెబ్‌సిరీస్‌ ‘దూత’ ప్రేక్షకులకు థ్రిల్‌ పంచింది నిజమే. ఆ విజయోత్సాహంతోనే మరో సిరీస్‌లో నటించేందుకు ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. కానీ ఇదంతా అబద్ధం. నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్‌’ మూవీపై దృష్టి పెట్టారు. చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది.

ఇది కూడా చదవండి: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారాలు.. ఏం చేశారంటే ?

 శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామంలో షూటింగ్ జరుగుతోంది. దేశభక్తి అంశాలతో నిండిన ప్రేమకథలో రాజు అనే మత్స్యకారుడిగా పాత్రలో చైతన్య నటిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తోంది' అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. అక్కినేని ఇంటికి కాబోయే కోడలు శోభిత ధూళిపాట ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శోభిత మరోసారి తనదైన ఫోజులతో అదరగొట్టింది. లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. మెరిసిపోతున్న లెహంగా ధరించి.. నడుము అందాలు ప్రదర్శించింది. ఈ పోస్టుకు 'ఫైర్ ఇన్ ద బజార్' అనే క్యాప్షన్ ఇచ్చింది. మేకప్ ఆర్టిస్టులను కూడా తన ఫొటోలకు జత చేసింది. ప్రస్తుతం ఆమె లుక్స్ వైరల్ అవుతున్నాయి. 

 

ఇది కూడా చదవండి: తగ్గేదేలేదంటున్న కొండా సురేఖ.. వేములవాడలో మరో వివాదం!

r

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్‌ అవార్డు..

"డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి.

New Update
Urvashi Rautela Award

Urvashi Rautela Award

Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు (గోల్డెన్ క్వీన్ అవార్డు) తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే డాకు మహారాజ్ లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి "దబిడి దిబిడి" పాటతో తెలుగు ఆడియన్స్ లో  ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసినా, ఊర్వశి పెర్ఫార్మన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

Also Read: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గోల్డెన్ క్వీన్ అవార్డు..

అయితే, ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును  అందుకున్న ఊర్వశి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ ఈ అవార్డును అందుకున్నట్టు ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో  సోషల్ మీడియా ద్వారా  పంచుకోవడం ఆనందంగా ఉంది" అని ఊర్వశి తెలిపింది, అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన  అభిమానులందరికి  ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్​గా స్టెప్ లేపేసారుగా..!

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment