/rtv/media/media_files/2026/05/07/mrunal-thakur-2026-05-07-09-56-53.jpg)
Mrunal Thakur
Mrunal Thakur: వేణు యెల్దండి Venu Yeldandi దర్శకత్వంలో తెరకెక్కబోయే యెల్లమ్మ Yellamma Movie సినిమా గురించి మరోసారి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. బలగం Balagam సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు, ఆ తర్వాత ‘యల్లమ్మ’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రకటించి చాలా కాలం అయినా ఇప్పటికీ షూటింగ్ ప్రారంభం కాలేదు.
మొదట ఈ సినిమాలో హీరోగా నాని Nani నటిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్‌కు ఒప్పుకోలేదని తెలిసింది. తర్వాత నితిన్ Nithiin పేరు కూడా వినిపించింది. చివరికి అందరికీ షాక్ ఇస్తూ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ Devi Sri Prasadనే హీరోగా ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా మూవీ టీమ్ విడుదల చేసింది.
Also Read: మోదీకి బిగ్ షాక్.. సుప్రీంకోర్టుకు దీదీ : బెంగాల్లో హైటెన్షన్!
హీరో విషయంలో క్లారిటీ వచ్చినప్పటికీ, హీరోయిన్ మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మొదట సాయి పల్లవి Sai Pallavi, తర్వాత కీర్తి సురేష్ Keerthy Suresh పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఎవరూ ఖరారు కాలేదు.
Also Read: అదిరిపోయే అప్‌డేట్.. బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ స్పెషల్ సాంగ్!
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ పాత్ర కోసం మృణాల్ ఠాకూర్ Mrunal Thakur పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ సినిమాల ద్వారా మృణాల్ చాలా దగ్గరైంది. తన సహజ నటనతో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.
Also Read: TMC రెండు ముక్కలు...మమత మీటింగ్‌కు 10 మంది ఎమ్మెల్యేల డుమ్మా!
ఇటీవల వచ్చిన Dacoit సినిమాలో కూడా ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మృణాల్ ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. అందుకే ‘యల్లమ్మ’ కథలో ఆమె పాత్ర బాగా సరిపోతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
అయితే మృణాల్ నిజంగా ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us