Mrunal Thakur: పుకార్లకు ఫుల్ స్టాప్.. పెళ్లిపై మృణాల్ షాకింగ్ కామెంట్స్!

మృణాల్ ఠాకూర్ ధనుష్ తో పెళ్లి పుకార్లను సరదాగా ఖండించింది. కానీ భవిష్యత్తులో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని, సరైన సమయం, సరైన వ్యక్తి వచ్చినపుడే ప్రకటిస్తానని తెలిపింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను కొంత అయోమయానికి గురి చేశాయి.

New Update
Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్, ధనుష్ మధ్య ప్రేమకథ వార్తలు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫిబ్రవరి 14 వాలెంటైన్ డే రోజున వీరి వివాహం జరుగుతుందని కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే, మృణాల్ ఆ వార్తలను సరదాగా ఖండించారు. ఆమె మాట్లాడుతూ, “ఫిబ్రవరి 14 అంటే ఏప్రిల్ ఫూల్స్ డే లా అనిపిస్తుంది,” అని నవ్వుతూ చెప్పింది.

Mrunal on Marriage Rumors

అలాగే, భవిష్యత్తులో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది, సరైన సమయం, సరైన వ్యక్తి, సరైన రోజు వచ్చినపుడే పెళ్లి ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

తాజాగా మృణాల్ కొత్త సినిమా “Do Deewane Shaher Mein” కోసం ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటోంది. తాజాగా ఏఐతో సృష్టించిన పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలాగే, మృణాల్ ఒక ఈవెంట్ లో తన “చెన్నై కనెక్షన్” గురించి మాట్లాడినప్పుడు, అభిమానుల దృష్టిలో ధనుష్ తో సంబంధాల పుకార్లు మరింతగా పెరిగాయి, ఎందుకంటే ధనుష్ చెన్నైలో ఉంటాడని ఇలా మొత్తానికి పుకార్లకు మృణాల్ ఫుల్ స్టాప్ పెట్టినట్టే కనిపిస్తోంది.

మొత్తానికి, మృణాల్ ధనుష్ తో పెళ్లి పుకార్లను సరదాగా ఖండించినప్పటికీ, భవిష్యత్తులో పెళ్లి సరైన సమయంలో నిజమైన ప్రేమ దొరికినప్పుడు చేసుకుంటానని  స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు