'RC16' లో మున్నా భయ్యా.. ఇదెక్కడి మాస్ రా మావా

రామ్‌చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో 'RC16' మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల దీని రెగ్యులర్‌ షూట్‌ మొదలైంది. ఈ చిత్రంలో ‘మీర్జాపూర్‌’ సిరీస్‌ ఫేమ్‌, బాలీవుడ్‌ నటుడు దివ్యేందు భాగమయ్యారు. ఈ విషయాన్ని డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

New Update
munna (1)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా 'ఉప్పెన' మూవీ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'RC16' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రం కోసం భారీ కాస్టింగ్ ను తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు భాగం అవ్వగా.. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైతం ఈ సినిమాలో భాగం అయ్యారు. 

కీలక పాత్రలో 'మీర్జాపూర్' నటుడు..

బాలీవుడ్ ఫేమస్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్' లో మున్నా భయ్యా అనే పాత్రతో భారీ క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు దివ్యేందు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు." మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా. వెల్‌కమ్ దివ్యేందు. లెట్స్‌ రాక్‌ ఇట్‌" అని పేర్కొన్నారు. 

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

ఇది కూడా చదవండి: భారత్‌తో కంగారు రెండో మ్యాచ్.. పింక్ బాల్‌కు వేదిక కానున్న అడిలైడ్

'RC16' లో మున్నా భయ్యా నటిస్తున్నాడనే విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ మేరకు బచ్చిబాబు సెలక్షన్ సూపర్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో 'RC16' లో దివ్యేందు ఎలాంటి తరహా పాత్రలో కనిపిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. 

రూరల్ విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ చరణ్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ చిత్రానికి 'పెద్ది' అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment