/rtv/media/media_files/2026/04/09/ram-charan-2026-04-09-07-37-48.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమా 'పెద్ది' విడుదల తేదీ మారుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావాల్సి ఉంది, కానీ ఇప్పుడు ఆ తేదీకి రావడం కష్టమని సినీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ఏంటో చిత్ర బృందం అధికారికంగా చెప్పే అవకాశం ఉంది. అయితే, సినిమా వాయిదా విషయం పక్కన పెడితే, ప్రస్తుతం ఈ సినిమాలో ఉండే ఒక స్పెషల్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది.
ఇటీవలే 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటి మానస వారణాసి, ఈ సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి ఒక ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మానస వారణాసి అంటే మన తెలుగు ప్రేక్షకులకు ఒక పక్కింటి అమ్మాయిలా, చాలా పద్ధతిగా కనిపిస్తుంది. కెరీర్ మొదట్లోనే ఇలాంటి పద్ధతైన ఇమేజ్ ఉన్న నటి, ఒక్కసారిగా గ్లామర్ ఒలకబోస్తూ స్పెషల్ సాంగ్ చేయడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ పాట గనుక క్లిక్ అయితే మానస కెరీర్ కు పెద్ద ప్లస్ అవుతుంది. ముఖ్యంగా రామ్ చరణ్ పక్కన డ్యాన్స్ చేసి మెప్పిస్తే, ఆమెకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ వస్తుంది. కానీ, ఇప్పటివరకు ఉన్న ఆమె సాఫ్ట్ ఇమేజ్ మారిపోయి, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారేమో అన్న భయం కూడా ఉంది. ఏదేమైనా, ఇది ఆమె కెరీర్‌కు ఒక పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు సినిమా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు విషయం తెలియదు. అయితే అంతకుముందు ఇదే సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ ను సంప్రదించగా ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. ఇక ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఫ్రెండ్లీ సినిమాతో గుర్తింపు
కాగా సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతకుముందు మానస వారణాసి మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.
Follow Us