2017లో కేరళలో జరిగిన ఒక ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి ఘటన తర్వాత తన జీవితం, కెరీర్ పూర్తిగా మారిపోయాయని నటి పార్వతి పేర్కొన్నారు. ఆ ఘోరం జరిగినప్పటి నుండి చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం ఉండాలని, తప్పు చేసిన వారికి శిక్ష పడాలని తాను గట్టిగా పోరాడుతున్నట్లు చెప్పారు.
సమాజంలో గుర్తింపు, పలుకుబడి ఉన్న ఒక వ్యక్తిగా అన్యాయాలపై స్పందించడం తన బాధ్యతని, తానేమీ గొప్పలు చేయడం లేదని పార్వతి వినమ్రంగా చెప్పారు. తనకంటే ముందు హక్కుల కోసం పోరాడిన ఎందరో వ్యక్తులు తనకు స్ఫూర్తిగా నిలిచారని ఆమె గుర్తుచేసుకున్నారు. న్యాయం కోసం తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం అంత తేలికగా సాగలేదని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. "నాకున్న బలమైన గొంతుకను నొక్కేయడానికి, నన్ను సినీ పరిశ్రమ నుండి పూర్తిగా దూరం పెట్టడానికి ఇండస్ట్రీలోని కొన్ని శక్తులు కలిసికట్టుగా ప్రయత్నించాయి. ఆ పరిస్థితులు నన్ను చాలా భయపెట్టాయని ఆమె తెలిపారు.
ఫోన్లలో బెదిరింపులు
సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకు గానూ తనపై సోషల్ మీడియాలో విపరీతమైన దాడులు జరిగాయని, చంపేస్తామంటూ ఫోన్లలో బెదిరింపులు వచ్చాయని, చివరికి అత్యాచారం చేస్తామంటూ కూడా భయపెట్టారని పార్వతి సంచలన విషయాలను బయటపెట్టారు. ఇన్ని అడ్డంకులు, బెదిరింపులు ఎదురైనా తలవంచకుండా మహిళల భద్రత కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.
కాగా పార్వతీ నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినప్పటికీ అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన దూతవెబ్ సిరీస్‌లో క్రాంతి షెణై అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగచైతన్యతో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. మళయాళంలో నటించిన బెంగళూర్ డేస్ చిత్రానికి గానూ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది.
Parvathy Thiruvothu : నాపై అత్యాచారం చేస్తా అన్నారు..హీరోయిన్ సంచలన కామెంట్స్!
సమాజంలో గుర్తింపు, పలుకుబడి ఉన్న ఒక వ్యక్తిగా అన్యాయాలపై స్పందించడం తన బాధ్యతని, తానేమీ గొప్పలు చేయడం లేదని పార్వతి వినమ్రంగా చెప్పారు. తనకంటే ముందు హక్కుల కోసం పోరాడిన ఎందరో వ్యక్తులు తనకు స్ఫూర్తిగా నిలిచారని ఆమె గుర్తుచేసుకున్నారు.