Malaika Arora: తండ్రి మరణం తర్వాత.. మలైకా ఎమోషనల్ పోస్ట్! నటి మలైకా తండ్రి మరణం తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తండ్రి అనిల్ మరణం తమకెంతో భాదని కలిగించిందని. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి, ప్రేమగల భర్త.. మా బెస్ట్ ఫ్రెండ్. నాన్న మరణంతో తమ కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతి లోనైందని ఎమోషనల్ అయ్యింది. By Archana 12 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update malaika arora father షేర్ చేయండి Malaika Arora: బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ కుల్దీప్ మెహతా బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. బాంద్రాలో ఆయన నివాసమైన అయేషా మనోర్ భవనంలోని ఏడో అంతస్థు పై నుంచి దూకి చనిపోయారు. అనిల్ మరణ వార్త మలైకా కుటుంబంతో పాటు మొత్తం ఇండస్ట్రీని కదిలించింది. అందరూ షాకయ్యారు. అనిల్ మరణ వార్త తెలియగానే మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్, అర్జున్ కపూర్, సలీం ఖాన్, కాజోల్ సహా పలువురు తారలు ఆమె ఇంటికి చేరుకొని అనిల్ కుటుంబాన్ని పరామర్శించారు. అనిల్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. మలైకా అరోరా ఎమోషనల్ పోస్ట్ తండ్రి అనిల్ మెహతా మరణం తర్వాత నటి మలైకా అరోరా సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ ను పంచుకుంది. "మా తండ్రి అనిల్ మరణంతో మాకు చాలా బాధను కలిగించింది. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి.. ప్రేమగల భర్త.. మా బెస్ట్ ఫ్రెండ్. నాన్న మరణంతో మా కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతికి లోనైంది. ఈ కష్ట సమయంలో మేము మీడియా, శ్రేయోభిలాషుల నుంచి గోప్యత ఆశిస్తున్నాము. మీ అందరి ప్రేమ, సపోర్ట్ కు ధన్యవాదాలు అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మలైకా. అనిల్ అరోరా అంత్యక్రియలు ఈరోజు ఉదయం శాంతా క్రజ్ స్మశానవాటికలో హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించనున్నట్లు సమాచారం." View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) పలు నివేదికల ప్రకారం మలైకా తల్లి జాయిస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. అనిల్ మెహతా రోజు ఉదయం బాల్కనీలో న్యూస్ పేపర్ చదివేవారని. కానీ బుధవారం గదిలో తన చెప్పులు కనిపించకపోవడంతో.. బాల్కనీలోకి వెళ్లగా.. కింద నుంచి వాచ్మెన్ బిగ్గరగా అరుస్తూ ఉన్నాడని తెలిపింది. అయితే అనిల్ మెహతా ఆమె భార్య జాయిస్ మలైకా 11 ఏళ్ళ వయసులోనే విడాకులు తీసుకున్నారు. మళ్ళీ కొన్నాళ్ళు ఇద్దరు కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ మెహతా మరణం అతని కుటుంబాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి