AMB Classic Hyderabad: మహేష్ బాబు మరో సెన్సేషన్.. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో “ఏఎంబీ క్లాసిక్” మల్టీప్లెక్స్‌ రెడీ!

మహేష్ బాబు బెంగళూరులో డాల్బీ సినిమా ప్రారంభించిన తర్వాత, ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో “ఏఎంబీ క్లాసిక్” అనే మల్టీప్లెక్స్‌ తీసుకురానున్నారు. ఈ థియేటర్‌లో 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ ఆట్మోస్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి.

New Update
AMB Classic Hyderabad

AMB Classic Hyderabad

AMB Classic Hyderabad: మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలనే కాదు, థియేటర్ అనుభవాన్ని కూడా కొత్త స్థాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో సౌత్ ఇండియాలో మొదటి డాల్బీ సినిమా ప్రారంభించిన ఆయన, ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అదే అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.

బెంగళూరులోని ఏఎంబీ సినిమాస్ కపాలి జనవరి 16, 2026న ప్రారంభమైంది. పాత కపాలి థియేటర్ స్థలంలో నిర్మించిన ఈ మల్టీప్లెక్స్‌లో 9 స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో 588 సీట్లతో, డ్యూయల్ 6K డాల్బీ విజన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇది ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభవాన్ని ఇస్తోంది.

ఇప్పుడు హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లో “ఏఎంబీ క్లాసిక్” అనే కొత్త మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. పాత సుదర్శన్ 70ఎంఎం థియేటర్ స్థలంలో ఈ ప్రాజెక్ట్‌ను మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ కలిసి అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మొత్తం 7 స్క్రీన్లు ఉండనున్నాయి.

సినిమా ప్రేమికులకు ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ ప్రాంతంలో ఇప్పుడు డాల్బీ సినిమా స్క్రీన్ కూడా రానుంది. అదనంగా 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ ఆట్మోస్ సౌండ్ వంటి అత్యాధునిక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. దీంతో ప్రేక్షకులు మరింత మంచి సినిమా అనుభవాన్ని పొందగలుగుతారు.

Advertisment
తాజా కథనాలు