Athidhi 4K Re Release: కొత్త స్టైల్ లో.. పాత 'అతిథి'.. రీ-రిలీజ్‌తో కొత్త ట్రెండ్ మొదలవుతుందా?

మహేష్ బాబు నటించిన అతిథి సినిమా “Athidhi 4K”గా కొత్త టెక్నాలజీతో, మార్పులతో మే 29, 2026న మళ్లీ విడుదల అవుతోంది. ఇది రీ-రిలీజ్‌లకు కొత్త ట్రెండ్ చూపిస్తుందని ఆశిస్తున్నారు మూవీ టీమ్.

New Update
Athidhi 4K Re Release

Athidhi 4K Re Release

Athidhi 4K Re Release: టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌లు మళ్లీ ఊపందుకున్నాయి. మహేష్ బాబు(Mahesh Babu) నటించిన 'అతిథి' సినిమా ఇప్పుడు “Athidhi 4K” పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి సాధారణ రీ-రిలీజ్ కాకుండా, పూర్తిగా కొత్త అనుభవం ఇవ్వాలని టీమ్ ప్రయత్నిస్తోంది. సినిమా 4Kలో రీస్టోర్ చేయడం, సౌండ్‌ను మళ్లీ రికార్డ్ చేయడం, కొన్ని సీన్స్‌ను రీ-ఎడిట్ చేయడం వంటి మార్పులు చేస్తున్నారు.

ఈ సినిమాను “రీఇంకార్నేషన్”గా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మే 29, 2026న గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. పాత సినిమాలను కొత్తగా ప్రేక్షకులకు చూపించడానికి ఇది ఒక కొత్త స్టెప్‌గా భావిస్తున్నారు.

అయితే ఈ ప్రయత్నంపై కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. టెక్నికల్‌గా సినిమా బాగుంటుంది కానీ, ఒరిజినల్ సినిమా ఫీల్ మారిపోతుందా అనే అనుమానం ఉంది. చాలా మంది ప్రేక్షకులకు పాత వెర్షన్‌తోనే మంచి జ్ఞాపకాలు ఉంటాయి. అలాంటి సమయంలో ఎక్కువ మార్పులు చేస్తే ఆ కనెక్షన్ తగ్గే అవకాశం ఉంది.

ఇటీవల సూర్య నటించిన ఒక రీ-రిలీజ్ ప్రయత్నం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అందుకే Athidhi 4K ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

అయినా ఈ సినిమా హిట్ అయితే, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు కూడా ఇలా కొత్తగా రీ-రిలీజ్ చేసే ట్రెండ్ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.

Advertisment
తాజా కథనాలు