Mahesh Babu: మహేష్ బాబు కారు చలాన్లు కట్టిన వీరాభిమాని.. వీడియో వైరల్!

మహేష్ బాబు కారు స్పీడ్ లిమిట్ దాటడంతో పడిన చలాన్లను ఒక అభిమాని స్వయంగా చెల్లించడంతో సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అయింది. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, వీడియో భారీగా వైరల్ అవుతున్నాయి.

New Update
Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఆయనపై చూపే ప్రేమ అసాధారణం. ఈ అభిమానానికి ఒక ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా వచ్చిన వీడియోలో, మహేష్ బాబు PVNR ఎక్స్‌ప్రెస్ రోడ్ పై తన కారు స్పీడ్ లిమిట్ దాటడంతో రెండు చలాన్లు పడినట్లు ఉంది. ఈ వార్తపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో, ఒక అభిమాని పెండింగ్‌లో ఉన్న 2,070 రూపాయల చలాన్ల మొత్తాన్ని స్వయంగా చెల్లించి వీడియోని షేర్ చేశాడు.

Mahesh Babu Car Challans Viral Video

అభిమానులు హీరోపై ఎలాంటి చిన్న మరక కూడా పడకుండా చూసే ప్రయత్నం చేసాడు ఆ అభిమాని. అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. మహేష్ బాబు వంద కోట్లకు పైగా పారితోషికం పొందే స్టార్ కాబట్టి, కారు చలాన్లను అభిమాని చెల్లించాల్సిన అవసరం లేదు. అభిమనం ప్రేమ ఉండొచ్చు, కానీ హీరోల కార్ చెలాన్లు కట్టాల్సిన అవసరం లేదని కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు, మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్-వర్డ్ల అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శనివారం RFSC లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో, సినిమా టైటిల్ ‘వారణాసి’ను అధికారికంగా ప్రకటించారు. అంతేకాక, మహేష్ బాబు ఫస్ట్ లుక్, ‘వారణాసి టు ది వరల్డ్’ వీడియోను కూడా విడుదల చేశారు.

వీడియోలో యుగాలు, ఖండాలతో నిండిన అద్భుతమైన విజువల్స్, మ్యూజిక్ తో మహేష్ బాబు తన చేతిలో త్రిశూలం పట్టుకుని ఎద్దుపై వస్తున్న సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఫస్ట్ లుక్ చూసి అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు. వేదికపై కూడా మహేష్ బాబు ఎద్దు బొమ్మపై కూర్చుని ఇచ్చిన ఎంట్రీ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి, మహేష్ బాబు ‘వారణాసి’ ఫస్ట్ లుక్, విజువల్స్ తో సినిమా పై క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.

Advertisment
తాజా కథనాలు